ఈ పాప పక్కా తెలుగమ్మాయి.. ఇప్పుడు కోలీవుడ్‌లో తోపు హీరోయిన్

బూరె బుగ్గలతో పింక్ గౌనులో బర్త్ డే క్యాండిల్ వంక తదేకంగా చూస్తున్న ఈ పాప.. పక్కా తెలుగమ్మాయి. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అయినప్పటికీ మాతృభాషలో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నానే అన్న బాధ. ఇప్పటికీ ఓ బడా బ్యానర్, బడా హీరో, పెద్ద దర్శకుడితో నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది.

బూరె బుగ్గలతో పింక్ గౌనులో బర్త్ డే క్యాండిల్ వంక తదేకంగా చూస్తున్న ఈ పాప.. పక్కా తెలుగమ్మాయి. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అయినప్పటికీ మాతృభాషలో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నానే అన్న బాధ. ఇప్పటికీ ఓ బడా బ్యానర్, బడా హీరో, పెద్ద దర్శకుడితో నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది.

ఇప్పుడు ఇండస్ట్రీలో వారసులదే హవా. ఎంతో మంది స్టార్ కిడ్స్ నటనా రంగంలోకి వచ్చి ఆకట్టుకుంటున్నారు. దీంతో నెపోటిజం ఎక్కువయ్యిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదైనా హీరోల పిల్లలు చిత్ర పరిశ్రమలోకి వస్తున్నారంటే.. తొలి సినిమా వరకు ఈ క్రేజ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత టాలెంట్ మీద కెరీర్, ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే.. సాధారణంగా స్టార్ హీరోల, హీరోయిన్ల కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతుంటారు. చాలా రేర్‌గా మాత్రమే కూతుళ్లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ ధోరణీ లేదు.. కానీ సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు.. పరిశ్రమలోకి వచ్చినా.. హీరోయిన్లుగా రావడం చాలా అరుదు. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారి ఒకప్పటి స్టార్ హీరో కూతురు.

కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా మారి.. ఛాలెంజింగ్ రోల్స్ చేసి.. హీరోలకు గట్టిపోటీనిస్తుంది. ఫిమేల్ ఓరియెంట్ చిత్రాలతో ఆకట్టుకుంటుంది. తండ్రేకాదు.. ఆమె తాత కూడా ఒకప్పటి స్టార్ హీరో. ఆమె ఫ్యామిలీ అంతా ఇంచుమించు నటనా రంగంలోనే కొనసాగుతుంది. తండ్రి హీరో అయినప్పటికీ.. ఆమె మిడిల్ క్లాస్ కష్టాలన్ని చూసింది. బాలనటిగా ఒక్క సినిమాతో అలరించింది.. కోలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది. తెలుగులో నటించడానికి చాలా సమయమే తీసుకుంది. వచ్చినా అలా పలకరించి.. ఇలా వెళ్లిపోయింది ఈ అచ్చ తెలుగు అమ్మాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించాలన్న కోరికతో పలుమార్లు గట్టిగానే తన గళాన్ని వినిపించింది. తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయ్యింది. అయితే తెలుగులో మాత్రం తనకు సరైన అవకాశాలు రావట్లేదని వాపోయింది.

కాస్త గ్యాప్ అయితే తీసుకుంది కానీ ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే ఐశ్వర్య రాజేష్. తాత అమర్నాథ్, తండ్రి రాజేష్ నుండి నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటుతోంది. ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మీ ఆమె మేనత్త. చిన్నప్పుడు రాంబంటు మూవీలో నటించింది ఐశ్వర్య. తల్లిదండ్రులిద్దరు తెలుగు వాళ్లే అయినప్పటికీ ఆమె చెన్నైలో పుట్టింది. చెన్నై, తిరుపతిలో ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యింది. 8 ఏళ్లకు తండ్రి రాజేష్ ని పొగొట్టుకుంది. కుటుంబ భారమంతా తల్లిపై పడింది. ఆ కష్టాలను చూసి ఐశ్వర్య.. బుల్లితెరపై టీవీ యాంకర్ అవతారమెత్తింది.

2010లో సినిమాలోకి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మాతృభాషలో నటించే అవకాశం దక్కింది. కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్‌లో అడుగిడిన ఐశ్వర్య, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ సెకండ్ హీరోయిన్ రోల్సే ఆమెను పలకరించాయి. ఇక తన డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. డ్రైవర్ జమున, ఫర్షానా, తీర్థ కాదల్, డీర్ చిత్రాలే కాకుండా సుడుల్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె కంఠశోష ఫలించి అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేశ్ భార్య పాత్రలో నటించనుంది ఈ బ్యూటీ. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత.

Show comments