iDreamPost
android-app
ios-app

నయనతార @ చిరు 157.. అనీల్ మామూలోడు కాదు.

  • Published May 17, 2025 | 1:06 PM Updated Updated May 17, 2025 | 1:06 PM

ఇండస్ట్రీలో ఎలాంటి నటి నటులైన తన స్క్రిప్ట్ తో ఒప్పించడం... ఈ దర్శకుడు మాత్రమే చేయగలడేమో. రీసెంట్ గా రిలీజ్ అయినా నయనతార ఇంట్రో వీడియో చూస్తే ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు. అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

ఇండస్ట్రీలో ఎలాంటి నటి నటులైన తన స్క్రిప్ట్ తో ఒప్పించడం... ఈ దర్శకుడు మాత్రమే చేయగలడేమో. రీసెంట్ గా రిలీజ్ అయినా నయనతార ఇంట్రో వీడియో చూస్తే ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు. అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published May 17, 2025 | 1:06 PMUpdated May 17, 2025 | 1:06 PM
నయనతార @ చిరు 157.. అనీల్ మామూలోడు కాదు.

ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ పని అనీల్ రావిపూడి చేసి చూపించాడు. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు. సోషల్ మీడియా అంతా ఇలానే అంటుంది . ఇంతకీ అసలు అనిల్ చేసిన ఘనకార్యం ఏంటా అని అనుకుంటున్నారా. ఆ విషయానికొస్తే ఇది విన్న ఎవరైనా అనీల్ మామూలోడు కాదురా అనే అంటారు. అసలు విషయం ఏంటంటే నయనతార ఓ మంచి నటిగా అందరికి తెలుసు. కేవలం సినిమాల్లో నటించడం.. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టడం తప్ప.. ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ , ఇంటర్వూస్ లాంటి వాటికి పెద్దగా అటెండ్ అవ్వదు ఈ భామ. ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేసినప్పటికీ పబ్లిసిటీకి మాత్రం దూరంగానే ఉంటుంది ఈ అమ్మడు. ఇలా పబ్లిసిటీకి దూరంగా ఉండేవారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారు సడెన్ గా ఓ ప్రమోషన్ లోనో ఓ ప్రోమో వీడియోలోనో కనిపిస్తే.. ఇక అంతే సంగతులు ఆ వీడియో ఇంటర్నెట్ ను ఒక ఊపు ఊపేస్తోంది.

ఇప్పుడు జరిగేది కూడా అదే. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న చిరు@157 లో నయనతార హీరోయిన్ గా నటించబోతుందంట. ఈ విషయాన్నీ స్వయంగా తానె ఓ ప్రోమో వీడియో ద్వారా తెలియజేయడం విశేషం. ఇప్పటివరకు నయన్ ఎలాంటి ప్రమోషనల్ వీడియో చేయలేదు. ఇప్పుడు అనిల్ పుణ్యమా అని ఈ అమ్మడు ఇంట్రోతో మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఆల్రెడీ చిరంజీవి , నయనతార కాంబినేషన్ లో సైరా నరసింహ రెడ్డి , గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో మూవీ. ఈసారి డైరెక్ట్ చేసేది అనిల్ రావిపూడి కావడంతో మూవీ మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ స్క్రిప్ట్స్ అన్ని ఏ విధంగా ఉంటాయో అందరికి తెలిసిందే. సినిమా స్టార్ట్ అవ్వకముందే ప్రమోషన్స్ ద్వారా ఈ రేంజ్ హైప్ సొంతం చేసుకుంటున్నాడంటే. ఇక రెగ్యులర్ షూట్స్ స్టార్ట్ అయితే ఏ రేంజ్ లో ఆర్టిస్ట్ లను వాడేస్తాడో అని అంతా అనుకుంటున్నారు.

ఈసారి అనిల్ చిరులోని వింటేజ్ మెగా మాస్ ని బయటికి తీస్తా అంటున్నాడు. 2026 సంక్రాంతిని టార్గెట్ చేసి ఈ సినిమాను ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు మూవీ టీం. ఇక అనిల్ సినిమాల షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తిచేసుకుంటాడు. ఈ లెక్కన చిరు మూవీ కూడా వీలైనంత త్వరగా పూర్తవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి అనిల్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి . మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.