iDreamPost
android-app
ios-app

అఖండ-2కి అడ్డంకులు! మేకర్స్ మాత్రం క్లారిటీగా ఉన్నారు!

  • Published Feb 07, 2024 | 11:31 AM Updated Updated Feb 07, 2024 | 11:37 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ సినిమాల అంటే.. ఇప్పటికి అందరికి అదొక తెలియని ఎనర్జీ. అయితే, ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా తీయాల్సి ఉంది. అయితే, తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది.. అలాగే ఈ సినిమాపై కొన్ని చర్చలు నడుస్తున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ సినిమాల అంటే.. ఇప్పటికి అందరికి అదొక తెలియని ఎనర్జీ. అయితే, ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా తీయాల్సి ఉంది. అయితే, తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది.. అలాగే ఈ సినిమాపై కొన్ని చర్చలు నడుస్తున్నాయి.

  • Published Feb 07, 2024 | 11:31 AMUpdated Feb 07, 2024 | 11:37 AM
అఖండ-2కి అడ్డంకులు! మేకర్స్ మాత్రం క్లారిటీగా ఉన్నారు!

నందమూరి బాలకృష్ణ ఒకప్పటి తరం హీరో అయినా కూడా.. ఇప్పటికి ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది తనదైన కొత్త తరహా కథలతో.. బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్నారు బాలకృష్ణ. వెండి తెరపై బాలకృష్ణ కనిపించాడంటే .. ఇక థియేటర్లో అందరూ జై బాలయ్య అంటూ ఊగిపోవాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ క్రియేట్ చేసిన ఎనర్జీ అలాంటిది. ఇక దర్శకుడు బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, బాలకృష్ణ ప్రస్తుతం .. దర్శకుడు బోయపాటితో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. కానీ, ఇంతవరకు ఆ సినిమా గురించి మిగిలిన ఏ విషయాలు బయటకు రాలేదు. దీనితో అభిమానులకు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు దానికి కారణం ఏమై ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ అంటే.. ఎటువంటి సందేహం లేకుండా వంద శాతం సక్సెస్ రేటును చూస్తుందని అంతా నమ్ముతారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు భారీ హిట్ ను సాధించాయి. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఆఖరి చిత్రం “అఖండ”. 2021లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ బాలకృష్ణ , బోయాపాటి కాంబినేషన్ వుండబోతుందనే వార్తలు వచ్చాయి. దీనితో అభిమానులంతా బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వీరి కాంబినేషన్ ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ, తాజాగా ఈ ప్రాజెక్ట్ 14 రీల్స్ బ్యానర్ లోనే కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమా అఖండ సిక్వెల్ .. అఖండ-2 అని కూడా ప్రకటించారు మేకర్స్.

అయితే, ఇప్పటివరకు వినిపించిన వార్తల ప్రకారం కేవలం ఈ అప్ డేట్ మాత్రమే ఇచ్చారు. కానీ, ఆ సినిమా గురించి మిగిలిన విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. చూడబోతుంటే బోయపాటి , బాలకృష్ణ కొత్త సినిమాకు ఎదో అడ్డు అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తోంది. దానికి కారణం కథ ఇంకా పూర్తి కాకపోవడమా ! , లేక బడ్జెట్ ప్రాబ్లమ్ ఆ ! అనేది ఎవరికీ అర్ధం కాకుండా పోతుంది. అసలు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పటికి వస్తుంది.. అనే కొత్త సందేహాలు కూడా మొదలుతున్నాయి. దీనితో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. కానీ, మేకర్స్ మాత్రం ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నారు. ఇక ఈ ప్రశ్నలకు చెక్ పెట్టాలంటే .. మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. మరి, ప్రస్తుతం బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ గురించి జరుగుతున్న చర్చలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş