P Krishna
Manjummel Boys Producers Issue: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ సినిమాలు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో మంజుమ్మెల్ బాయ్స్ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని భారీ కలెక్షన్లు రాబడుతుంది.
Manjummel Boys Producers Issue: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ సినిమాలు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో మంజుమ్మెల్ బాయ్స్ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని భారీ కలెక్షన్లు రాబడుతుంది.
P Krishna
ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కూడా రాబడుతున్నాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాలైనా భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మాలీవుడ్ లో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నాయి. ఇతర భాషల్లో కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ను అల్లాడించాయి. తాజాగా మంజుమ్మెల్ బాయ్స్ బాయ్స్ నిర్మాతకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. వివరాల్లోకి వెళితే..
మాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాత బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని ఎర్నాకుళం లోయర్ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేరళా అరూర్ కు చెందిన సిరాజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై ఎర్నాకులం సబ్ కోర్టు ఈ తీర్పనిచ్చింది. తాను సినిమా కసం 7 కోట్లు ఖర్చు చేశానని.. ఇప్పటి వరకు తన పెట్టుబడి ఇవ్వలేదని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేరళాకు చెందిన సిరాజ్ మూవీ నిర్మాణ సమయంలో 7 కోట్ల ఖర్చు చేశానని.. నిర్మాతలు తనకు 40 శాతం లాభం వాటాగా ఇస్తామని వాగ్ధానం చేశారని.. కానీ డబ్బు చెల్లించకుండా తనను మోసం చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సబ్ కోర్టు జడ్జీ సునీల్ వర్కీ ఈ మూవీ నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్, దాని భాగస్వామి షాన్ ఆంటోనీ కి సంబంధించిన 40 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు.
చిదంబరం దర్శకత్వం వహించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ మల్టీ స్టారర్ మూవీకి మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఆధరణ లభించింది. ఈ చత్రం ఫిబ్రవరి 22 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తమిళ డబ్బంగ్ లేకుండా తమిళనాట 50 కోట్లు వసూళ్లు చేసిన తొలి పరభాష చిత్రం ఇదే. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.220 కోట్ల, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా దాదాపు రూ.20 కోట్లు వసూళ్లు చేసింది. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలు అయిన సౌబిన్ షాహిర్, బాబు షాహిర్ కు కోర్టు నోటీసులు పంపించింది. ఈ చిత్రం పరవ ఫిలిమ్స్, శ్రీ గోకుళం మూవీస్ రిలీజ్ చేశాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ మలయాళ సినీ చరిత్రలో 200 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా నిలవడం మరో విశేషం. తమ ఖాతాలను స్తంభించిన విషయంలో మంజుమ్మెల్ బాయ్స్ మూవీ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడలి.