iDreamPost
android-app
ios-app

ఇది సలార్ vs డుంకి కాదు.. ప్రశాంత్ నీల్ vs షారుఖ్ ఖాన్!

  • Author ajaykrishna Published - 03:28 PM, Sat - 30 September 23
  • Author ajaykrishna Published - 03:28 PM, Sat - 30 September 23
ఇది సలార్ vs డుంకి కాదు.. ప్రశాంత్ నీల్ vs షారుఖ్ ఖాన్!

సాధారణంగా సినిమా రిలీజ్ ల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందులోనూ పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ అంటే.. అసలు ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెండు బిగ్గెస్ట్ మూవీస్ మధ్య క్లాష్ గురించి ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్. రెండోది కింగ్ షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరాని కాంబినేషన్ లో వస్తున్న డుంకి. ఈ రెండు సినిమాకు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయి. అదికూడా పాన్ ఇండియా మూవీస్ గా.. ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండటం విశేషం.

ఇంతవరకు ఎవరు అంచనా వేయలేని క్లాష్ ఇది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి, డార్లింగ్ ప్రభాస్ సినిమాల మధ్య పోటీ ఏర్పడుతుందని అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ.. ఎట్టకేలకు పడింది. రెండు సినిమాలు అసలు తగ్గేదేలే అంటూ.. థియేటర్స్ కి రాబోతున్నాయి. అయితే.. హీరోల మధ్య పోటీ ఎప్పుడూ ఉండదు తెలిసిందే కదా! వారి సినిమాలకు మధ్యనే పోటీ. వరల్డ్ అంతా సలార్ కి, డుంకి సినిమాలకు మధ్య పోటీ అని మాట్లాడుకుంటున్నారు. కానీ.. అసలు పోటీ ప్రభాస్ – షారుఖ్, సలార్ – డుంకిలకు కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఎవరికి మధ్య పోటీ? అనంటే.. కింగ్ షారుఖ్ ఖాన్ కి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి మధ్య అని అంటున్నారు.

అందుకు కారణం కూడా లేకపోలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం.. అంటే 2018లో డిసెంబర్ 21న రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ జరిగింది. ఒకటి షారుఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ మూవీ కాగా.. మరొకటి యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’. ఆ ఏడాది కేజీఎఫ్ మూవీ ఇలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డబ్బింగ్ సినిమాగా కేజీఎఫ్ హిందీలో విడుదలై.. బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానికి పోటీగా వచ్చిన షారుఖ్ జీరో మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని బోల్తా పడింది. మరి ఐదేళ్ల తర్వాత.. మళ్ళీ ఒకేరోజు సలార్, డుంకి రిలీజ్ అవుతున్నాయి. అంటే.. ఈసారి కూడా ప్రశాంత్ నీల్, షారుఖ్ ల మధ్య పోటీగానే చూడాలని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom