iDreamPost
android-app
ios-app

గూస్ బంప్స్ తెప్పించే సీన్.. ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి-అల్లు అర్జున్?

  • Published Aug 29, 2024 | 6:22 PM Updated Updated Aug 29, 2024 | 6:22 PM

మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గూస్ బంప్స్ తెప్పించే ఈ సీన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గూస్ బంప్స్ తెప్పించే ఈ సీన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

  • Published Aug 29, 2024 | 6:22 PMUpdated Aug 29, 2024 | 6:22 PM
గూస్ బంప్స్ తెప్పించే సీన్.. ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి-అల్లు అర్జున్?

మెగాస్టార్ చిరంజీవి-అల్లు కుటుంబానికి మధ్య దూరం పెరిగిపోతోందని, ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని గత కొంతకాలంగా వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కదా మేం కోరుకునేది అంటూ ఆనందపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్లో గ్రాండ్ గా ఈ వేడుకలను నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవలే మెగాస్టార చిరంజీవిని కూడా కలిసి బాలయ్య స్వర్ణోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. మెగాస్టార్ సైతం వచ్చేందుకు సానుకూలంగా స్పందించారు.

ఇక తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసి బాలయ్య స్వర్ణోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బన్నీ బాలయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. వేడుకకు వస్తానని చెప్పినట్లు సమాచారం. దాంతో ఒకే వేదికపై మెగాస్టార్-ఐకాన్ స్టార్ కనిపించబోతున్నారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము కోరుకునేది ఇదే.. గూస్ బంప్స్ తెప్పించే సీన్ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఒకే స్టేజ్ పై చిరు-బన్నీ కనిపిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet