iDreamPost
android-app
ios-app

Swag Teaser: ‘స్వాగ్’ టీజర్.. శ్రీ విష్ణు అల్లాడించాడు!

  • Published Aug 29, 2024 | 5:37 PM Updated Updated Aug 29, 2024 | 8:02 PM

Sree Vishnu Swag Teaser Review: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉందో.. ఇప్పుడు చూద్దాం.

Sree Vishnu Swag Teaser Review: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉందో.. ఇప్పుడు చూద్దాం.

  • Published Aug 29, 2024 | 5:37 PMUpdated Aug 29, 2024 | 8:02 PM
Swag Teaser: ‘స్వాగ్’ టీజర్.. శ్రీ విష్ణు అల్లాడించాడు!

టాలీవుడ్ ప్రేక్షకులు వైవిధ్యమైన సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఇక హీరోలు సైతం వారి అభిరుచికి తగ్గట్లుగానే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగే హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘స్వాగ్’. ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. విలక్షణమైన గెటప్స్ తో శ్రీ విష్ణు యాక్టింగ్ తో అల్లాడించాడు. ఆ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

‘స్వాగ్’.. శ్రీ విష్ణు- హసిత్ గోలి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టైటిల్ రివీల్ దగ్గర నుంచి వరుసగా ఇస్తున్న అప్డేట్స్ స్వాగ్ పై ఎంతో క్యూరియాసిటీని రేకెత్తించాయి. ఇక ఈ మూవీలో శ్రీ విష్ణు ట్రాన్స్ జెండర్ గా కనిపిస్తాడన్న వార్తలు వైరల్ గా మారాయి. దానికి తోడు ఏకంగా 14 గెటప్పుల్లో శ్రీ విష్ణు కనిపిస్తాడన్న న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసింది. దాంతో ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూడసాగారు. వారి వెయిటింగ్ కు తెరదించుతూ.. మేకర్స్ తాజాగా టీజర్ ను విడుదల చేశారు. మెుదటి నుంచి ఈ మూవీలో శ్రీ విష్ణు విచిత్రమైన గెటప్స్ కు సంబంధించి అప్డేట్స్ ను ఇస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచడంలో మేకర్స్ విజయవంతం అయ్యారు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు కొడుకు ఎవరు? అని తెలుసుకునే క్రమంలో జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అన్నట్లు అర్థమవుతోంది. ఇక శ్రీ విష్ణు వివిధ గెటప్పులో తన యాక్టింగ్ తో అల్లాడించాడు. రాజుల కాలాన్ని టచ్ చేస్తూ.. వర్తమానానికి స్టోరీని ఎలా కనెక్ట్ చేశారా? అన్నది మరింత క్యూరియాసిటీని పెంచేసింది. స్త్రీ జాతిని ద్వేషించే పాత్రలో, వారియర్ గా, రాజుగా వివిధ క్యారెక్టర్స్ లో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. అతడి లుక్, డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మరోవైపు రాణిగా, కామన్ వుమెన్ గా రీతు వర్మ యాక్టింగ్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. కామెడీని కూడా ఇలాంటి కథలో జోడీంచడం డైరెక్టర్ హసిత్ గోలికే చెందింది. మెుత్తానికి స్వాగ్ తో శ్రీ విష్ణు మరోసారి సరికొత్త ప్రయోగం తో పాటుగా హిట్ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ టీజర్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rashmika Mandanna: భయపెట్టేందుకు రెడీ అవుతున్న నేషనల్ క్రష్! ఆ హర్రర్ మూవీలో..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio