Swetha
Game Changer Movie Updates: భారీ పోటీ మధ్య గేమ్ ఛేంజర్ రంగంలోకి దిగుతుంది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.అయితే ఇప్పుడు అసలు టాపిక్ సంక్రాంతి హీరోల గురించి కాదు.
Game Changer Movie Updates: భారీ పోటీ మధ్య గేమ్ ఛేంజర్ రంగంలోకి దిగుతుంది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.అయితే ఇప్పుడు అసలు టాపిక్ సంక్రాంతి హీరోల గురించి కాదు.
Swetha
గేమ్ ఛేంజర్ అసలైన గేమ్ ఇప్పుడే మొదలైంది. ఇప్పటివరకు సినిమా మీద ఉన్న అంచనాలు, ఆశలు ఒకెత్తు. టీజర్ తర్వాత ఇప్పుడు సినిమా మీద పెరుగుతున్న అంచనాలు ఒకెత్తు. భారీ పోటీ మధ్య గేమ్ ఛేంజర్ రంగంలోకి దిగుతుంది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే ఇక వసూళ్లు ఆటోమాటిక్ గా వచ్చేస్తాయి. అందులోను సంక్రాంతి సీజన్ కాబట్టి కథ బావుంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. కానీ ఏ మాత్రం యావరేజ్ లేదా మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ.. కాంపిటీటర్స్ వసూళ్లను ఎగరేసుకుపోతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అసలే రేసులో బాలకృష్ణ , వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు. ఆ డైరెక్టర్స్ కూడా మామూలోళ్లు కాదు. బాబీ , అనిల్ రావిపూడి నువ్వా నేనా అన్నట్లుగా వస్తున్నారు. ఇక్కడేమో చెర్రీ ఇండియన్ 2 తో డిజాస్టర్ అయినా శంకర్ చేతిలో ఉన్నాడు. అయితే అన్ని సినిమాలు ఒకటి అని చెప్పలేంలే కానీ.. ప్రేక్షకులలో మాత్రం ఎక్కడో ఇది కాస్తైన ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు టాపిక్ సంక్రాంతి హీరోల గురించి కాదు.
మ్యాటర్ ఏంటంటే.. కొద్దీ రోజుల క్రితం గేమ్ ఛేంజర్ కు పోటీగా హిందీలో ఓ సినిమా రిలీజ్ అవుతుందనే టాక్ నడిచింది. నిజానికి ఇది పుష్ప 2 కి పోటీగా వద్దాం అనుకున్న మూవీ. అదే విక్కీ కౌశల్ చావా. కానీ పుష్పరాజ్ మ్యానియా చూసి ఇది సైడ్ అయిపొయింది. దీనితో ఈ మూవీ కచ్చితంగా గేమ్ ఛేంజర్ కు పోటీగా వస్తుందని.. కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అది కూడా క్యాన్సిల్ అయిందట. మరొక నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకుని ఫిబ్రవరి 19 న చావా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. ఈ సినిమా పోస్ట్ పోన్ కు కారణాలు ఏంటో చెప్పలేంలే కానీ.. పోస్ట్ ప్రొడక్షన్, VFX గురించి ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమా కనుక పోస్ట్ పోన్ అయితే నార్త్ బెల్ట్ లో గేమ్ ఛేంజర్ కు పెద్ద రిలీఫ్ దక్కినట్లే. ఇది కాకుండా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతి రేసులో ఉందని టాక్ వినిపించింది. కానీ ఇంతవరకు మైత్రి వారినుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు.
సో ఇలా చూసినట్లయితే గేమ్ ఛేంజర్ కు బాలీవుడ్ నుంచి కొంత ముప్పు తప్పినట్లే. ఒక్కసారి కథ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తే మాత్రం.. ఇక కలెక్షన్స్ ఆపడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం అంతా పుష్ప 2 ఫీవర్ కమ్ముకుంటుంది. సో ఈ లెక్కన్న గేమ్ ఛేంజర్ మీద చాలా పెద్ద బాధ్యత ఉందని చెప్పి తీరాల్సిందే. మరో వారంలో ఈ సినిమాలోని మూడో ఆడియో సింగల్ ని రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ తమన్ తాను ఇవ్వాల్సిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. మరో యాభై రోజుల్లో మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు గేమ్ ఛేంజర్ పబ్లిసిటీని కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. టీజర్ కంటే రెండు రెట్లు ఎక్కువగా సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.