Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రపై కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా కులాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఆయనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. హీరో ఉపేంద్ర 2018లో ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ అంటూ ఓ రాజకీయ పార్టీని పెట్టారు. ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినప్పటికీ అప్పుడప్పుడు తన పార్టీ కార్యకర్తలు అభిమానులతో ఆయన మీట్ అవుతూ ఉన్నారు.
రాజకీయాల గురించి చర్చిస్తూ ఉన్నారు. శనివారం ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర కొన్ని కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనపై కొందరు వ్యక్తులు కేసు పెట్టారు. బెంగళూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆయన మాట్లాడాడన్న ఉద్దేశ్యంతో ఈ కేసు నమోదైంది.
ఇక, తన వ్యాఖ్యలపై ఉపేంద్ర క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్బంగా నేను నోరు జారాను. ఆ మాటలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తెలుసుకున్న వెంటనే.. ఆ వీడియోను నా సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేయించాను. నేను నా మాటలకు క్షమాపణ చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు. మరి, ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.