iDreamPost
android-app
ios-app

Balakrishna: చిరు-బాలయ్య మల్టీస్టారర్.. ఆ ఛాన్స్ బోయపాటి శ్రీనుకే దక్కుతుందా?

  • Published Sep 02, 2024 | 5:22 PM Updated Updated Sep 02, 2024 | 5:22 PM

Boyapati Srinu, Chiranjeevi, Balakrishna: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయాలనుందని చిరు చెప్పడంతో.. భారీ మల్టీస్టారర్ రాబోతోందని అర్థమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను చేసే దమ్ము, ఛాన్స్ బోయపాటి శ్రీనుకే ఉందని చాలా మంది అభిప్రాయాపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Boyapati Srinu, Chiranjeevi, Balakrishna: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయాలనుందని చిరు చెప్పడంతో.. భారీ మల్టీస్టారర్ రాబోతోందని అర్థమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను చేసే దమ్ము, ఛాన్స్ బోయపాటి శ్రీనుకే ఉందని చాలా మంది అభిప్రాయాపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Sep 02, 2024 | 5:22 PMUpdated Sep 02, 2024 | 5:22 PM
Balakrishna: చిరు-బాలయ్య మల్టీస్టారర్.. ఆ ఛాన్స్ బోయపాటి శ్రీనుకే దక్కుతుందా?

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. స్వర్ణోత్సవ వేడులకు తెలుగు ఫిలిం ఛాంబర్ గ్రాండ్ గా నిర్వహించింది. హైదరాబాద్ లోని నోవోటెల్ లో జరిగిన ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లతో పాటుగా ఎంతో మంది ప్రముఖులు హాజరైయ్యారు. ఇక ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ‘ఇంద్ర’ సినిమాకు బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ స్ఫూర్తి అని, మంచి ఫ్యాక్షన్ సినిమాలో బాలయ్యతో కలిసి నటించాలని ఉన్నట్లు మెగాస్టార్ ఈ వేదిక సాక్షిగా చెప్పారు. దాంతో వీరిద్దరిని మాస్ గా చూపించే డైరెక్టర్ ఎవరా? చూస్తున్న వేళ.. అందరి కళ్లు ఓ డైరెక్టర్ పై పడ్డాయి.. అతడే బోయపాటి శ్రీను.

ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమరసింహా రెడ్డి కథను రాసుకొస్తే.. నేను నటించడానికి రెడీ అని మెగాస్టార్ చెప్పడం, తాను కూడా దానికి సిద్దం అని బాలయ్య అనడంతో.. త్వరలోనే టాలీవుడ్ షేక్ అయ్యే మల్టీస్టారర్ రాబోతోందని మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిరు, బాలయ్య అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో చిరు చేసిన ఈ కామెంట్స్ తో త్వరలోనే వారి కోరిక తీరేలా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాకు దర్శకత్వం వహించే దమ్ము ఎవరికుందా? అనే. ఈ క్రమంలో వినిపిస్తున్న ఏకైక పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

బోయపాటి శ్రీను.. టాలీవుడ్ లో మాస్ సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన రూపొందించిన మూవీసే దానికి నిదర్శనం. భద్ర, తులసి, సింహా, లెజెండ్, అఖండ.. ఈ సినిమాలు చూస్తేనే తెలుస్తుంది.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లలో తనలా హీరోలను ఓ రేంజ్ మాస్ లో చూపించే వారు లేరని. మరీ ముఖ్యంగా బాలకృష్ణను బోయపాటి చూపించినంత మాస్ గా ఇంకెవ్వరూ చూపించలేరంటే అతిశయోక్తికాదేమో. ఇక మెగాస్టార్ తో కూడా ఓ సినిమా చేయాలని ఈ స్టార్ డైరెక్టర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సందర్భం వచ్చినట్లుగా టాలీవుడ్ భావిస్తోంది. ఫ్యాక్షన్ సీనిమాలను హ్యాండిల్ చేయడంలో బోయపాటి శ్రీనుకి మంచి పట్టుంది. దాంతో చిరు-బాలయ్య మూవీని డైరెక్ట్ చేసే ఛాన్సూ, దమ్ము రెండు కూడా ఈ స్టార్ డైరెక్టర్ కే ఉన్నాయని అందరూ భావిస్తున్నారు.

ఇక ఈ ముగ్గురి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్ అయితే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ రేసులో ఫ్యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బి. గోపాల్ కూడా ఉన్నాడు. కానీ.. ప్రస్తుతం ఆయన అంత యాక్టీవ్ గా లేరు. ఇక మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మంది మాత్రం బోయపాటి శ్రీను అయితేనే చిరు-బాలయ్యలను మాస్ గా చూపిస్తాడని చెప్పుకొస్తున్నారు. మరి మెగాస్టార్-బాలకృష్ణ మూవీకి ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş