iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈసారి ఎవరి రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

  • Published Sep 02, 2024 | 4:35 PM Updated Updated Sep 02, 2024 | 4:35 PM

Bigg Boss Telugu Season 8 Contestants Remuneration Details: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అయిపోయింది. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లిన 14 మంది రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎవరెవరికి వారానికి ఎన్ని లక్షలంటే?

Bigg Boss Telugu Season 8 Contestants Remuneration Details: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అయిపోయింది. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లిన 14 మంది రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎవరెవరికి వారానికి ఎన్ని లక్షలంటే?

  • Published Sep 02, 2024 | 4:35 PMUpdated Sep 02, 2024 | 4:35 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈసారి ఎవరి రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుంది అని ఎదురుచూస్తున్నారు. అది కాస్తా స్టార్ట్ అయిన తర్వాత కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి ఆ ప్రశ్నల్లో ప్రముఖంగా వినిపించేది.. వాళ్లకు వారానికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు? ఈ ప్రశ్న మరోసారి వైరల్ గా మారింది. ఈ ప్రశ్నకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూవర్ ఆదిరెడ్డి తనకు తెలిసిన.. తాను అంచనా వేసిన లెక్కలైతే చెప్పుకొచ్చాడు. ఆ లెక్కల ప్రకారం ఈసారి సీజన్ లో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? ఎవరికి తక్కువ రెమ్యూనరేషన్ ఉంది? అసలు ఈ రెమ్యూనరేషన్ ని ఎలా డిసైడ్ చేస్తారు? ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం.

సాధారణంగా ఏ షో అయినా.. రెమ్యూనరేషన్ ను రెండు రకాలుగా డిసైడ్ చేస్తారు. మొదటిది వాళ్లకు ఉన్న డిమాండ్ ఎంత? వచ్చే కంటెస్టెంట్ పాపులారిటీ, రీచ్ ని బట్టి వాళ్లకు ఇచ్చే మొత్తాన్ని డిసైడ్ చేస్తారు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే.. ఆ కంటెస్టెంట్ అవసరం బిగ్ బాస్ షోకి ఎంత వరకు ఉంది? వాళ్లు కచ్చితంగా కావాలి అనుకుంటే.. ఎంత డిమాండ్ చేసినా కూడా బిగ్ బాస్ యాజమాన్యం చెల్లించడానికి రెడీ అయిపోతుంది. లేదులే.. అంత పెట్టి వాళ్లు దేనికి అనుకుంటే మాత్రం.. సైలెంట్ గా వేరే వాళ్లని సెలక్ట్ చేసుకుని హౌస్ లోకి పంపేస్తారు. బిగ్ బాస్ కి వెళ్లాలి వెళ్లాలి అని తహతహలాడే వాళ్లకు మాత్రం కచ్చితంగా రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంటుంది.

బిగ్ బాస్ లో మాత్రం ఏ సీజన్ అయినా కూడా రెమ్యూనరేషన్ ని వారాల చొప్పున ఇస్తారు. ఎందుకంటే హౌస్ లో వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి. ఒకవేళ మిడ్ వీక్ వచ్చినా కూడా వారికి వీక్ మొత్తానికి పేమెంట్ చేస్తారు. అందుకే ఎప్పుడూ వారాల చొప్పున పారితోషకం ఉంటుంది. ఈసారి షోలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇంటి సభ్యురాలు విష్ణు ప్రియ అని తెలుస్తోంది. సోషల్ మీడియా, బయట ఫాలోయింగ్ ని బట్టి చూస్తే.. హౌస్ లో ఉన్న అందరిలో విష్ణుప్రియానే పాపులర్ కంటెస్టెంట్. కాబట్టి ఆమెకు వారానికి రూ.4 లక్షలు వరకు చెల్లిస్తున్నారు అని తెలుస్తోంది. ఆ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ హీరో ఆదిత్య ఓంకు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ఆదిత్య ఓంకు వారానికి రూ.3 లక్షలు పారితోషకం ఇస్తున్నారు.

ఫుల్ రెమ్యూనరేషన్ వారానికి (అంచనా):

  • యష్మీ గౌడ- రూ.2.50 లక్షలు
  • నిఖిల్ మలియక్కల్- రూ.2.25 లక్షలు
  • అభయ్ నవీన్- రూ.2 లక్షలు
  • ప్రేరణ కంభం- రూ.2 లక్షలు
  • ఆదిత్య ఓం- రూ.3 లక్షలు
  • సోనియా- రూ.1.50 లక్షలు
  • బెజవాడ బేబక్క- రూ.1.50 లక్షలు
  • ఆర్జే శేఖర్ బాషా- రూ.2.50 లక్షలు
  • కిరాక్ సీత- రూ.2 లక్షలు
  • నాగ మణికంఠ- రూ1.20 లక్షలు
  • పృథ్వీరాజ్- రూ.1.5 లక్షలు
  • విష్ణు ప్రియ- రూ.4 లక్షలు
  • నైనికా- రూ.2.20 లక్షలు
  • యూట్యూబర్ నబీల్ అఫ్రీదీ- రూ.2 లక్షలు

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio