iDreamPost
android-app
ios-app

సలార్ పై విషం కక్కుతున్న బాలీవుడ్ మీడియా! షారుక్ కోసం దిగజారి!

షారుక్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, సలార్ కు మాత్రం ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా సలార్ పై అప్పుడే విమర్శలు మొదలు పెట్టింది.

షారుక్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, సలార్ కు మాత్రం ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా సలార్ పై అప్పుడే విమర్శలు మొదలు పెట్టింది.

సలార్ పై విషం కక్కుతున్న బాలీవుడ్ మీడియా! షారుక్ కోసం దిగజారి!

ఇండియన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద వార్ జరగడానికి సమయం దగ్గర పడుతోంది. సలార్, డంకీ మూవీస్ ఒక్క రోజు గ్యాప్ లో విడుదల అవ్వబోతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ రెండు చిత్రాల్లో ఏది అంచనాలను నిలబెట్టుకుంటుందా అనే ఆసక్తి అంతటా నెలకొంది. షారుక్ నటించిన డంకీ మూవీ డిసెంబర్ 21న.. ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే షారుక్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, సలార్ కు మాత్రం ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా సలార్ పై అప్పుడే విమర్శలు మొదలు పెట్టింది. సలార్ కు అడ్వాన్స్ బుకింగ్స్ పాక్షికంగా ఓపెన్ అవ్వడంతో.. ఈ ఏడాది సలార్ కంటే డంకీనే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందనే కధనాలు వినిపిస్తున్నాయి.

డంకీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో నాలుగున్నర కోట్లు వసూళ్లు అయ్యాయి. సలార్ కు మాత్రం కేవలం మూడున్నర కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయంటూ ప్రచారం చేస్తోంది. అలాగే ఇప్పటివరకు డంకీ చిత్రానికి ఫస్ట్ డే 59,000 టిక్కెట్లు అమ్ముడుపోగా, సలార్ కు 15,000 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా కాస్త తొందరపడి.. సలార్ చిత్రం కంటే డంకీ చిత్రానికే ఎక్కువ క్రేజ్ ఉంది.. అంటూ పోల్చడం మొదలుపెట్టింది. ప్రభాస్ కు తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్ బాలీవుడ్ కు తెలియనిది కాదు. ఒక్కసారి బుకింగ్స్ ఓపెన్ అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ వసూళ్లను ఏ రేంజ్ వరకు తీసుకుని వెళ్తారో అందరికీ తెలుసు. చూస్తుంటే ఇంకా పూర్తిగా బుకింగ్స్ ఓపెన్ కాకముందే బాలీవుడ్ మీడియా సలార్ పై విషం కక్కుతున్నట్టు ఉంది.

ప్రభాస్ సౌత్ ఇండియాలో పాపులర్ రెబెల్ స్టార్.. నార్త్ లో షారుక్ దే పై చేయి. కాగా, వరుస ప్లాపుల్లో ఉన్నపటికీ ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే ఓవర్సీస్ లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో.. అడ్వాన్స్ బుకింగ్స్ లో వేగంగా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన చిత్రంగా.. ‘సలార్’ గుర్తింపు తెచ్చుకుంది. ఇలా చూస్తే సలార్.. డంకీపై తన ఆధిక్యతను కనబరుస్తూనే ఉంది. ఇక, ఇప్పటికే రెండు రూ.1000 కోట్ల సినిమాలు అందించి షారుక్ ఖాన్ ఊపు మీదున్నాడు. కాబట్టి సహజంగానే అతని తర్వాత మూవీ మీద భారీగా అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో డంకీ నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో.. ఎక్కువ వసూళ్లను రాబట్టడంలో ఆశ్చర్యం లేదు.

అలానే ఆ ప్రాంతాలలో ప్రభాస్ సినిమాకు వసూళ్లు కాస్త తగ్గడం అనేది సహజం. కేవలం కొన్ని కారణాల వలన అడ్వాన్స్ బుకింగ్స్ లో.. ఆధిక్యత కనబరచనంత మాత్రాన, బాలీవుడ్ మీడియా సలార్ ను విస్మరించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ పూర్తి స్థాయిలో సలార్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత.. ఇటువంటి పోలిక కనబరిస్తే అభిమానులు సైతం సరైన పద్ధతిలో స్పదించేందుకు వీలుగా ఉండేదేమో. ఏదేమైనా, ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జోరుగా ఉండబోతుందని చెప్పడంలో..ఎటువంటి సందేహం లేదు. మరి, సినిమాలు ఇంకా విడుదల కాకముందే, బాలీవుడ్ మీడియా సలార్ పై విషం కక్కుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.