iDreamPost
android-app
ios-app

డబ్బు కోసం నటించాలంటే భయమేస్తోంది!.. ఆలియా భట్

  • Published Nov 28, 2023 | 8:00 PM Updated Updated Nov 28, 2023 | 8:00 PM

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకలో ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకలో ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 28, 2023 | 8:00 PMUpdated Nov 28, 2023 | 8:00 PM
డబ్బు కోసం నటించాలంటే భయమేస్తోంది!.. ఆలియా భట్

అటు బాలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను ‘ఆలియా భట్’ గురించి తెలియని వారు ఉండరు. బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆలియా తెలుగులోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. 2022లో విడుదలైన ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలోనూ తన అద్భుతమైన నటనను కనబరించింది ఈ అమ్మడు. తన మెస్మరైజింగ్ నటన, ఆకట్టుకునే అందంతో జాతీయ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను ఆమె సొంతం చేసుకుంది. ఇక రణ్ బీర్ కపూర్, ఆలియా జంట గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, తాజాగా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో ఆలియా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

తాజాగా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో భాగంగా మాట్లాడుతూ.. ఆలియా ఇలా ప్రస్తావించారు. ‘ఈ మధ్య కాలంలో వరుసగా వస్తున్న అవార్డులు నాపై మరింత బాధ్యతను పెంచుతున్నాయి. నటి అన్న తర్వాత అన్ని పాత్రలను చేయాలి. కానీ, చేసిన ప్రతి పాత్ర తనకు అవార్డు తెచ్చే విధంగా ఉండడం మాత్రం కష్టం. అయితే, ఇంకా ఎన్నో మంచి పాత్రలను చేయాలని ఈ అవార్డులు చెప్పకనే చెబుతున్నాయి. కానీ, ప్రతిసారి అద్భుతమైన నటనను కనబరచడం మాత్రం అంత తేలికైన విషయం కాదని’ ఆలియా పేర్కొన్నారు. ఇక అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా తన తర్వాత చిత్రాలు ఉండాలని అభిప్రాయపడింది.

ఈ క్రమంలో తాను డబ్బులు తీసుకుని కమర్షియల్ పాత్రలలో నటిస్తే, అలా చేసిన ఆలియా ఇలా చేస్తుందేంటి అంటారేమో అనే భయంగా ఉందని ఆలియా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఆలియా తన అందంతో, నటనతో ప్రేక్షకులను ప్రతిసారి మెప్పిస్తూనే ఉన్నారు. తల్లి అయిన తర్వాత కూడా ఆలియా ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఫిలింఫేర్‌ ఓటీటీ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్నవయసులో జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకుని రికార్డు సృష్టించడం పట్ల ఆమె మాట్లాడుతూ ‘ఆ అవార్డు అందుకున్న వారందరిలో నేనే చిన్నదాన్నని ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం తెలిశాక రణ్‌బీర్‌ నాకు చాలా విలువైన బహుమతి ఇచ్చాడు. ఏమిచ్చాడో అడగొద్దు.. అది సీక్రెట్‌’ అంటూ ముగించేశారు ఆలియా.

ఇక తెలుగులోనూ మంచి కథలు వస్తే నటించడానికి సిద్ధం అని చెప్పారు ఆలియా. సినిమాలతో పాటు ఓటీటీలోను నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆలియా ప్రకటించారు. ఏదేమైనా, నటీ నటులు ప్రతిసారి ప్రేక్షకులను మెప్పించకపోయినా, వారి అభిమానులు మాత్రం వారి చిత్రాలను.. హిట్ చేస్తూనే ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం అతిశేయోక్తి లేదు. మరి, ఆలియా భట్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet