iDreamPost
android-app
ios-app

సలార్ కోసం బిగ్ స్కెచ్.. త్వరలో అసలు గేమ్ స్టార్ట్..!

  • Published Dec 14, 2023 | 7:23 PM Updated Updated Dec 14, 2023 | 7:23 PM

'సలార్' మూవీ కోసం డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22 కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రమోషన్లను ట్రైలర్, పాటల రూపంలో షురూ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

'సలార్' మూవీ కోసం డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22 కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రమోషన్లను ట్రైలర్, పాటల రూపంలో షురూ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

  • Published Dec 14, 2023 | 7:23 PMUpdated Dec 14, 2023 | 7:23 PM
సలార్  కోసం బిగ్ స్కెచ్.. త్వరలో అసలు గేమ్ స్టార్ట్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ పాన్ ఇండియా మూవీ కోసం డార్లింగ్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. స‌లార్ సినిమా మ‌రో ప‌ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయినా సినిమా యూనిట్‌ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌లేదు. ఎలాంటి ప్ర‌మోష‌న్స్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండానే డైరెక్ట్‌గా సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించకపోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఇక ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేసిన చిత్ర యూనిట్ తాజాగా దూకుడు పెంచింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రభాస్ ‘సలార్’ మూవీని హోంబలే ఫిల్మ్స్ కోట్లాది రూపాయలతో నిర్మించింది. తాజాగా ఈ సినిమాలో మొదటి సాంగ్ విడుదల చెయ్యగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవా- వరదరాజ్ మన్నార్ స్నేహనికి సంబంధించిన కథను ప్రశాంత్ నీల్ ఈ పాటలో వివరించాడు. కానీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో మేకర్స్ నిర్లక్ష్యం ఉన్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. సాధారణంగా హోంబలే సంస్థ ప్రచార వ్యూహాల గురించి కొత్తగా చెప్పాలసిన అవసరం లేదు. అందుకే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేసేందుకు ఏకంగా డైరెక్టర్ రాజమౌళినే రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళికి హోంబలే సంస్థతో మంచి అనుబంధం ఉంది. గతంలో ‘కేజిఎఫ్ చాఫ్టర్-1’ తెలుగు ఈవెంట్‌కు జక్కన్న ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఇప్పుడు సలార్ మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్ విషయంలో అదే స్ట్రాటజీనీ ఫాలో అవుతున్నారు.

Salaar

త్వరలోనే సలార్ టీమ్‌ని ఇంటర్వ్యూ చేయడానికి రాజమౌళి సిద్ధం అవుతున్నాడట.  ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఆయన ఇంటర్వ్యూ చేయనున్నారట. అయితే రాజామౌళి ఇంటర్వ్యూను అన్నీ తెలుగు ఛానల్స్‌లో ప్రసారం చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభాస్-రాజామౌళి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. గతంలో రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూ చేశారు. అందులో ప్రభాస్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇప్పుడు కూడా సలార్ మూవీకి ఇదే పంథాను కొనసాగిస్తున్నారు.  కాగా, ప్రభాస్ సలార్ మూవీని డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌ రేపటి నుంచే ప్రారంభం అవుతుందని సలార్ మేకర్స్ ప్రకటించారు. అలాగే రెండో ట్రైలర్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులో విడుదల కానున్న సలార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి , సలార్ టీమ్ పై జక్కన్న ఇంటర్వ్యూ చేయబోతున్నరనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom