iDreamPost
నైజామ్ లో ఏకంగా 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి మరీ సత్తా చాటాడు. మిగిలిన ఏరియాలకు సంబంధించిన వసూళ్ల రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా అందుతున్నాయి. సరే రెస్పాన్స్ బాగానే ఉంది మరి ఛాన్స్ మిస్ అవ్వడమేంటి అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం.
నైజామ్ లో ఏకంగా 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి మరీ సత్తా చాటాడు. మిగిలిన ఏరియాలకు సంబంధించిన వసూళ్ల రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా అందుతున్నాయి. సరే రెస్పాన్స్ బాగానే ఉంది మరి ఛాన్స్ మిస్ అవ్వడమేంటి అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం.
iDreamPost
నిన్న భారీ ఎత్తున విడుదలైన భీమ్లా నాయక్ కు బ్రహ్మాండమైన స్పందన దక్కుతోంది. చాలా చోట్ల రికార్డు కలెక్షన్లతో గ్రాండ్ ఓపెనింగ్ దక్కించుకున్నాడు. నైజామ్ లో ఏకంగా 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి మరీ సత్తా చాటాడు. మిగిలిన ఏరియాలకు సంబంధించిన వసూళ్ల రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా అందుతున్నాయి. సరే రెస్పాన్స్ బాగానే ఉంది మరి ఛాన్స్ మిస్ అవ్వడమేంటి అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ముందుగా ప్లాన్ చేసినట్టు హిందీ వెర్షన్ ఒకేసారి రిలీజ్ కాలేకపోయింది. డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు సెన్సార్, డిస్ట్రిబ్యూటర్ డీల్స్ తదితర కారణాల వల్ల వాయిదా వేయక తప్పలేదు. కాకపోతే మరీ ఆలస్యం చేసే ఛాన్స్ లేదు.
ముంబై సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు గంగూబాయ్ కటియావాడికి భారీ సంఖ్యలో థియేటర్లు ఇవ్వడంతో ఒకవేళ భీమ్లా నాయక్ కు హిట్ టాక్ వచ్చినా కూడా తగినన్ని స్క్రీన్లు లేక ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో పోస్ట్ పోన్ కు అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చని అంటున్నారు. ఒకవేళ ధైర్యం చేసి పుష్ప పార్ట్ 1 తరహాలో రిలీజ్ చేసి ఉంటే నార్త్ ఆడియన్స్ ఖచ్చితంగా ఎగబడి చూసేవాళ్ళు. భీమ్లా నాయక్ లో ఉన్న మాస్ కంటెంట్, పవన్ రానాల పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యేవి. అందుకే ఓవర్ లేట్ కాకుండా సాధ్యమైనంత మేరకు మార్చి 4నే వదిలేలా హక్కులు పొందిన నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
మొత్తానికి మన సినిమాలకు ఉత్తరాదిన ఈ స్థాయిలో థియేట్రికల్ డిమాండ్ పెరగడం సంతోషించాల్సిన విషయమే. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించిన వాటికి పర్లేదు చూడొచ్చనే టాక్ వచ్చినా చాలు కనక వర్షం కురుస్తోంది. అలా అని ప్రతి చిత్రాన్ని ఇదే స్థాయిలో ఆదరిస్తారన్న గ్యారెంటీ లేదు. రవితేజ ఖిలాడీకి పరాభవం తప్పలేదు. ఇక్కడ ఆడిన శ్యామ్ సింగ రాయ్ అక్కడ మేజిక్ చేయలేకపోయింది. ఈ ఫలితాలను పక్కనపెడితే పోటీకి భయపడకుండా టాలీవుడ్ భారీ సినిమాలన్నీ ఇకపై సేమ్ డే రిలీజ్ సూత్రాన్ని పాటిస్తే మరో అతి పెద్ద మార్కెట్ మనకు ఏర్పడుతుంది. పుష్ప పునాది వేసింది. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ లు కొనసాగించబోతున్నాయి
Also Read : Gangubai Kathiawadi Report : గంగూబాయ్ కటియావాడి రిపోర్ట్