iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 7లోకి బ్యాంకాక్ పిల్ల.. వైరల్ అవుతున్న వీడియో!

  • Author Soma Sekhar Updated - 01:00 PM, Sat - 15 July 23
  • Author Soma Sekhar Updated - 01:00 PM, Sat - 15 July 23
బిగ్ బాస్ 7లోకి బ్యాంకాక్ పిల్ల.. వైరల్ అవుతున్న వీడియో!

బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు వచ్చాయి కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. అలా ప్రేక్షకుల మనసు దోచిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా 7వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మేకర్స్ ఓ ప్రోమోని కూడా వదిలారు. గత బిగ్ బాస్ సీజన్స్ కంటే ఈసారి భిన్నంగా ఉండబోతోందట సీజన్ 7. ఇక ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు వినిపించాయి. ఈ లిస్ట్ లో యూట్యూబ్ సెన్సేషన్ బ్యాంకాక్ పిల్ల కూడా ఉన్నట్లు తాజా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించింది బ్యాంకాక్ పిల్ల. అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

శ్రావణి సమంతపూడి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ బ్యాంకాక్ పిల్ల అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. బ్యాంకాక్ తో ఉంటూ అక్కడి ప్రాంతాల్లో వీడియోలు తీసి తన యూట్యూబ్ ఛానల్ తో అప్లోడ్ చేస్తుంది శ్రావణి. తన యాసతో వీక్షకులను విశేషంగా తక్కువ టైమ్ లోనే ఆకట్టుకుంది. దాంతో ఆమె ఛానల్ కు రెండు మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్స్ వచ్చారు. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? బిగ్ బాస్ 7లోకి బ్యాంకాక్ పిల్ల వస్తుందన్న వార్త. దానికి బలమైన కారణం ఆమె ఇండియా రావడమే.

తాజాగా ఈ వార్తలపై ఇండియా వచ్చాక స్పందించింది బ్యాంకాక్ పిల్ల. ఆ వీడియోలో బ్యాంకాక్ పిల్ల మాట్లాడుతూ..”నేను బిగ్ బాస్ 7లోకి వెళ్తున్నాను అన్న వార్తలు ఎవరు పుట్టించారో నాకు తెలీదు. ఈ వార్త చదవగానే నాకే ఆశ్చర్యం వేసింది. అదీకాక ఆ వార్తలు బాగా వైరల్ కావడంతో.. నిజంగానే నేను సెలక్ట్ అయ్యానా? అని డౌట్ వచ్చి నా మెయిల్స్ కూడా చెక్ చేసుకున్నాను. కానీ నాకు బిగ్ బాస్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ వస్తే.. ఆ విషయం మీ అందరితో పంచుకుంటా. పిలవని పేరంటానికి వెళితే అస్సలు బాగోదు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మకండి” అంటూ బ్యాంకాక్ పిల్ల తన తాజా వీడియోలో చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే ఇండియాకు వచ్చీ రావడంతోనే బిగ్ బాస్ వార్తలకు చెక్ పెట్టింది శ్రావణి. బ్యాంకాక్ లోని అక్కడి ప్రదేశాలను, వింతలను తెలియజేస్తూ.. యూట్యూబ్ లోవ వీడియోలు చేస్తూ.. ఫేమర్ అయ్యింది ఈ బ్యాంకాక్ పిల్ల. తన యాసతో అతి తక్కువ టైమ్ లోనే యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది ఈ అమ్మడు. దాంతో సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ 7లో ఛాన్స్ వచ్చిందని అందరు అనుకున్నారు. కానీ ఆ వార్తలకు తన తాజా వీడియోతో చెక్ పెట్టింది బ్యాంకాక్ పిల్ల.


ఇదికూడా చదవండి: సినిమాలో క్యారెక్టర్ కోసం హీరోయిన్ ని దూరం పెట్టిన హీరో!