iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ లో డిజాస్టర్ ఇచ్చిన భాగమతి డైరెక్టర్!

  • Published Feb 18, 2024 | 4:53 PM Updated Updated Feb 18, 2024 | 4:53 PM

Bagamati Director Ashok: ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు గడ్డుకాలం నడుస్తుందనే చెప్పవచ్చు. అందుకే అక్కడి నుంచి వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న బాగమతి సినిమా డైరెక్టర్ కి కూడా బాలీవుడ్ లో చేదు అనుభవం ఎదురైంది.

Bagamati Director Ashok: ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు గడ్డుకాలం నడుస్తుందనే చెప్పవచ్చు. అందుకే అక్కడి నుంచి వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న బాగమతి సినిమా డైరెక్టర్ కి కూడా బాలీవుడ్ లో చేదు అనుభవం ఎదురైంది.

  • Published Feb 18, 2024 | 4:53 PMUpdated Feb 18, 2024 | 4:53 PM
బాలీవుడ్ లో డిజాస్టర్ ఇచ్చిన భాగమతి డైరెక్టర్!

2023లో వరుసగా బ్లాక్ బస్టర్లతో గోల్డెన్ ఇయర్ ను చూసిన బాలీవుడ్ 2024లో మాత్రం గడ్డు కాలం ఎదుర్కొంటుంది. నిజానికి కరోనా మహమ్మారి తరువాత బాగా దెబ్బ పడింది హిందీ సినిమాలకే. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో తెలీక హిట్ సినిమాలు అందించడంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కాస్త తడబడ్డారు. అయితే 2023 లో పఠాన్, జవాన్, గదర్ 2, యానిమల్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తో హిందీ సినిమా కళ కళలాడింది. అదే ఊపును 2024 లో బాలీవుడ్ కొనసాగిస్తుంది అనుకుంటే కథ మళ్ళీ మొదటికొచ్చింది.

హృతిక్ రోషన్, దీపికా పదుకునే జంటగా నటించిన ఫైటర్ ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున విడుదలై అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ వసూళ్లు సాధించింది. షాహిద్ కపూర్ – కృతి సనన్ నటించిన తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా కూడా మంచి బిజినెస్ చేసి అంచనాల కంటే మెరుగ్గా ఉంది కానీ మరీ పెద్ద హిట్ ఏమీ కాదు. తాజాగా  ప్రముఖ గాయకుడు గురు రంధావా హీరోగా నటించిన తొలి చిత్రం కుచ్ ఖట్టా హో జాయ్ ఈ వారం విడుదలై బాలీవుడ్ కు మరో అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. సింగర్ గా గురు రంధావా సింగిల్స్ కు యూట్యూబ్ లో కొద్ది రోజుల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ట్రేడ్ వర్గాలు గురుకు థియేటర్లలో కూడా అదే తరహా ఆదరణ లభిస్తుందని ఆశించాయి.

కానీ అందుకు పూర్తి భిన్నంగా కుచ్ ఖట్టా హో జాయ్ సినిమాను ప్రేక్షకులు పూర్తిగా తిప్పి కొట్టారు. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు 25 లక్షలు మాత్రమే. దాంతో ఇటీవలి కాలంలో మొదటి రోజు నమోదైన అత్యంత చెత్త కలెక్షన్లు అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. 2018లో అనుష్కతో భాగమతి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన అశోక్ జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కోవిడ్ సమయంలో బాలీవుడ్ వెళ్లిన ఈ దర్శకుడి తొలి హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద వాష్ అవుట్ అయింది.