iDreamPost
android-app
ios-app

Tripti Dimri: వీడియో: ఆ టాలీవుడ్ స్టార్ హీరోపై మనసు పారేసుకున్న యానిమల్ బ్యూటీ!

  • Published Dec 13, 2023 | 1:05 PM Updated Updated Dec 13, 2023 | 1:05 PM

యానిమల్ సినిమాలో జోయా పాత్రలో తన నటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుని.. ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారింది బాలీవుడ్ భామ త్రిప్తి. కుర్రాళ్లంతా త్రిప్తిపై మనసు పారేసుకుంటే.. ఆమె మాత్రం.. టాలీవుడ్ స్టార్ హీరోపై మనసు పడింది. ఆ వివరాలు..

యానిమల్ సినిమాలో జోయా పాత్రలో తన నటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుని.. ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారింది బాలీవుడ్ భామ త్రిప్తి. కుర్రాళ్లంతా త్రిప్తిపై మనసు పారేసుకుంటే.. ఆమె మాత్రం.. టాలీవుడ్ స్టార్ హీరోపై మనసు పడింది. ఆ వివరాలు..

  • Published Dec 13, 2023 | 1:05 PMUpdated Dec 13, 2023 | 1:05 PM
Tripti Dimri: వీడియో: ఆ టాలీవుడ్ స్టార్ హీరోపై మనసు పారేసుకున్న యానిమల్ బ్యూటీ!

త్రిప్తి దిమ్రి.. మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు మార్మొగిపోతుంది. ఈ సినిమాతో ఈ బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యానిమల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రలో నటించిన రష్మిక కన్నా.. త్రిప్తికే ఎక్కువ క్రేజ్ లభించింది. యానిమల్ హిట్ తర్వాత సోషల్ మీడియాలో త్రిప్తి ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇన్నాళ్లు నేషనల్ క్రష్ అనగానే రష్మిక అనేవారు.. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి త్రిప్తి చేరింది. యానిమల్ సినిమాలో ఈ బ్యూటీ చేసిన జోయా పాత్రకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక మన తెలుగు ప్రేక్షకులు కూడా జోయాను విపరీతంగా లవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి టాలీవుడ్ స్టార్ హీరోపై తనకున్న లవ్ ని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న లవ్ ను బయటపెట్టింది. ఇంటర్వ్యూ సందర్భంగా సౌత్ లో ఏ హీరోతో నటించాలని ఉంది అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. తనకు దక్షిణాదిలో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది త్రిప్తి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

animal beauty love with tollywood star hero

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పేరు హాలీవుడ్ స్థాయి వరకు వెళ్లింది. ఆస్కార్ బరిలోనూ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత.. దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ అయ్యారు. బాలీవుడ్ బ్యూటీలు సైతం ఎన్టీఆర్ మీద మనసు పారేసుకుంటూ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో త్రిప్తి చేరింది. ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. త్రిప్తికి అవకాశం ఇస్తారో లేదా అని చర్చించుకుంటున్నారు. అంతేకాక వార్ 2లో ఎన్టీఆర్ సరసన త్రిప్తికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని రికమెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

యానిమల్ సినిమా కన్నా ముందు త్రిప్తి.. బాలీవుడ్ లో హీరోయిన్, సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది. 2017లో వచ్చిన పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను(2018)లో ఆమె మొదటి ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలేవి ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు.

ఈ క్రమంలో తాజాగా సందీప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి కీలక పాత్రలో నటించి.. అందరి ప్రశంసలు పొందుతుంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి కీలక పాత్రలో నటించింది. అలానే ప్రభాస్ స్పిరిట్‌లోనూ తృప్తికి సందీప్ వంగా ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetyedibahis girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom