అర్జున్ రెడ్డి విషయంలో వెనకడుగు వేసిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు అదే విషయంలో యానిమల్ తో రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏ విషయంలో సందీప్ రిస్క్ తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
అర్జున్ రెడ్డి విషయంలో వెనకడుగు వేసిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు అదే విషయంలో యానిమల్ తో రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏ విషయంలో సందీప్ రిస్క్ తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
సందీప్ రెడ్డి వంగ.. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని మెుత్తం తనవైపు తిప్పుకున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీసిన ‘అర్జున్ రెడ్డి’బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. ఇటు డైరెక్టర్ కు, అటు హీరోకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే విజయ్ వరుసగా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్-రష్మికతో ‘యానిమల్’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో సందీప్ రెడ్డి వంగా యానిమల్ తో రిస్క్ చేస్తున్నాడా? అంటూ పరిశ్రమలోని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి ఇంతకీ డైరెక్టర్ చేసే ఆ రిస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
‘యానిమల్’ రణ్ బీర్ కపూర్-రష్మిక మందన్న జోడీగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉంది. కాగా ఇటీవలే విడుదలైన పాటలకు, టీజర్ కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో అర్జున్ రెడ్డి మూవీకి తీసుకోని రిస్క్.. యానిమల్ కు సందీప్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే? ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం యానిమల్ నిడివి అక్షరాల 3 గంటల 30 నిమిషాలని సమాచారం.
అదీకాక ఫైనల్ సెన్సార్ కాపీకి కూడా ఇంతే నిడివితో పంపించారని టి-సిరీస్ వర్గాలు తెలిపినట్లు వినికిడి. అయితే గతంలో అర్జున్ రెడ్డికి రాజీ పడి.. నాలుగు గంటల సినిమాలో గంట సినిమాను ఎడిట్ చేయించాడు సందీప్ రెడ్డి వంగా. కానీ యానిమల్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఇక ఈ విషయంలో హీరో రణ్ బీర్ కపూర్ కూడా సందీప్ కే సపోర్ట్ గా ఉన్నాడట. కాగా.. ఇంతసేపు ఆడియన్స్ ను సీట్లో కట్టిపడేయం అంటే సవాల్ తో కూడుకున్నదనే చెప్పాలి. మూవీ సూపర్ గా వచ్చిందని, ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీలవ్వకుండా సినిమా చూస్తాడని నమ్మకంగా చెబుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. అందుకే ఈ రిస్క్ చేస్తున్నాడట.
ఇదిలా ఉండగా.. నిడివి ఇలాగే ఉంటే యానిమల్ కు రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సి రావొచ్చని సమాచారం. గతంలో అమీర్ ఖాన్ లాగాన్ విషయంలో, షారుఖ్ హం ఆప్కే హై కౌన్ సినిమాల విషయంలో ఇదే జరిగింది. కాగా.. ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. సందీప్ అర్జున్ రెడ్డి విషయంలో వెనకడు వేయడానికి కారణం అప్పట్లో విజయ్ కొత్త హీరో కావడం, తాను కూడా కొత్త దర్శకుడు కావడంతో థియేటర్ వర్గాల నుంచి మద్దతు లభించదనే నాలుగు గంటల సినిమాను డౌట్ తో గంటకు పైగానే ఎడిట్ చేయించి వదిలాడు. ప్రస్తుతం సందీప్ స్టార్ డైరెక్టర్ కావడం, మరోవైపు రణ్ బీర్-రష్మిక లాంటి జోడీ ఉండటంతో.. ఈ రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి యానిమల్ విషయంలో సందీప్ వంగా రిస్క్ చేస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.