iDreamPost
android-app
ios-app

అనిల్- వెంకీ- దిల్ రాజు కాంబో మరోసారి రిపీట్!

  • Published Feb 01, 2024 | 7:13 PM Updated Updated Feb 01, 2024 | 7:13 PM

Anil Ravipudi- Dil Raju- Venkatesh: తెలుగు సినిమా ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ లో సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది.

Anil Ravipudi- Dil Raju- Venkatesh: తెలుగు సినిమా ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ లో సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది.

  • Published Feb 01, 2024 | 7:13 PMUpdated Feb 01, 2024 | 7:13 PM
అనిల్- వెంకీ- దిల్ రాజు కాంబో మరోసారి రిపీట్!

టాలీవుడ్ లో కొన్ని కాంబోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ల కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిదే అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేశ్ కాంబో. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి.. తెలుగు ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబట్టాయి. ఇప్పుడు ఈ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అంటూ ఇండస్ట్రీలో టాక్ స్టార్ట్ అయ్యింది. అది కూడా దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేశ్ సినిమా ఉండబోతోందని చెబుతున్నారు. ఈ వార్త వినగానే ఆడియన్స్ ఇప్పటి నుంచే సంబరాలు స్టార్ట్ చేశారు.

తెలుగు ఇండస్ట్రీలో కామెడీ జానర్ లో ఎంతో కొంత వెలితి ఉందని అందరూ తెలుగు ప్రేక్షకులు అనుకునేవాళ్లు. కానీ, ఎప్పుడైతే అనిల్ రావిపూడి డైరెక్టర్ అయ్యాడో అప్పటి నుంచి ఆ వెలితి తీరినట్లు అయ్యింది. తనదైన పంచులతో, మార్కు డైలాగులతో ప్రతి సీన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంటాడు. అలాంటి డైరెక్టర్ కి వెంకీ మామలాంటి హీరో దొరికితే ఇంకేమైనా ఉంటుందా? టైటిల్స్ పడ్డ దగ్గరి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు పొట్ట పగిలేలా నవ్వుకోవడమే. ఆ విషయం ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో నిజం కూడా అయ్యింది. మళ్లీ ఎప్పుడెప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పుడు ఆ కాంబినేషన్ టాలీవుడ్ లో మరోసారి రీపీట్ కాబోతోంది అంటూ చెబుతున్నారు. ఒక పక్కా ఫ్యామిలీ ఎంట్ర టైనర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టులో ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారంట. ఇప్పటికే అనిల్ రావిపూడి- దిల్ రాజు కాంబినేషన్ లో సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3 అని మొత్తం చిత్రాలు వచ్చాయి. అవన్నీ ఇండస్ట్రీలో మంచి హిట్స్ గా నిలిచాయి. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా స్పెషల్ గా నిలుస్తుంది. ఎందుకంటే ఒక డబుల్ హ్యాట్రిక్, ఒక హ్యాట్రిక్ చిత్రం కాబోతోంది కాబట్టి.

ఇప్పుడు ఈ క్రేజీ కాంబో రిపీట్ కాబోతోంది అని తెలియగానే తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మొదలైంది. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఇందులో హీరోయిన్ ఎవరు? ఇది కూడా మల్టీ స్టారర్ ఏమైనా అవుతుందా? అంటూ అబ్బో చాలానే ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ విషయం మీద కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అధికారికంగా ఈ కాంబినేషన్ గురించి ప్రకటించే ఛాన్స్ ఉంది. మరి.. అనిల్ రావిపూడి- వెంకటేశ్- దిల్ రాజు కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio