iDreamPost
android-app
ios-app

ఈ పాప ఇప్పుడు బిజీ నటి! తన జోలికి వస్తే ఎవరికైనా తాట తీసేసుద్ది!

  • Published Mar 11, 2024 | 5:27 PM Updated Updated Mar 11, 2024 | 5:27 PM

రెడ్ గౌనులో ముసి ముసి నవ్వులు చిందిస్తున్న ఈ పాప.. చాలా ఫేమస్. ప్రస్తుతం బిజీయెస్ట్ నటి. సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. తన జోలికి వస్తే.. తాట తీస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

రెడ్ గౌనులో ముసి ముసి నవ్వులు చిందిస్తున్న ఈ పాప.. చాలా ఫేమస్. ప్రస్తుతం బిజీయెస్ట్ నటి. సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. తన జోలికి వస్తే.. తాట తీస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Mar 11, 2024 | 5:27 PMUpdated Mar 11, 2024 | 5:27 PM
ఈ పాప ఇప్పుడు బిజీ నటి! తన జోలికి వస్తే ఎవరికైనా తాట తీసేసుద్ది!

ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా వామనావతారంలో ఓ పద్యం ఉంటుంది. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఈ పద్యం అర్థం. ఇది కేవలం హీరోలకే కాదూ..నటీమణులకు కూడా వర్తిస్తుంది. టీవీ రంగం నుండి బిగ్ స్క్రీన్ పై సత్తా చాటారు..చాటుతూనే ఉన్నారు చాలా మంది ముద్దుగుమ్మలు. హీరోలతో పోల్చుకుంటే.. స్క్రీన్ స్కేప్ తక్కువైనా, కెరీర్ చిన్నదైనా ఆ ఆలోచన చేయకుండా ప్రూవ్ చేసుకోవాలన్న ఆత్రుత కనబరుస్తున్నారు. ఇదే వాళ్లను స్టార్ హీరోయిన్లుగా లేదంటే బిజీయెస్ట్ నటీమణులుగా చేస్తోంది. అలాగే ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తూ లైమ్ లైట్‌లో ఉంటున్నారు. ఆ జాబితాలోకే కచ్చితంగా వస్తుంది ఈ చిన్నారి.

నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి..వస పిట్ట. చలాకీ భామ. ఇప్పుడే స్టార్ యాక్ట్రెస్. అందరిలానే తాను ఓ సామాన్యురాలు. కానీ తాను ఊహించి ఉండదు.. ఇప్పుడు ప్రేక్షకుల నుండి ఇంత ఆదరణ లభిస్తుందని. కానీ ఆమె పడ్డ కష్టమే.. ఇప్పుడు శిఖరాలపై కూర్చొండేలా చేసింది. అప్పుడెప్పుడో ఓ సినిమాలో అలా మెరిసింది. కానీ క్రెడిట్ దక్కలేదు. అయినా కుంగిపోలేదు ఉన్నత చదువులు చదివింది. ఆ తర్వాత టీవీ ఛానల్లో న్యూస్ రీడర్ అవతారం ఎత్తింది. డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్, విలనీ, హీరోయిన్ అబ్బో ఇలా చెప్పుకుంటే.. ఆమె చేయని పాత్ర లేదేమో అనిపిస్తుంది. ఇంతకు ఆ రెడ్ గౌన్ పాప ఎవరంటే..పదాహారాణాల తెలుగింటి అమ్మాయి అనసూయ భరద్వాజ్. 2003లో జూ ఎన్టీఆర్ నాగ చిత్రంలో అక్కడెక్కడో ఓ సీనులో అలా కనిపిస్తుంది అంతే. ఆమె అని గుర్తుపట్టలేరు కూడా.

హైదరాబాద్‌లో ఏంబీఎ చదివాక.. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా కొన్ని రోజులు పనిచేసింది అనసూయ. ఆ తర్వాత ఆమె మనస్సు ఎంటర్‌టైన్ మెంట్ రంగం వైపు మళ్లింది. సాక్షి టీవీ న్యూస్ ప్రెజెంటర్‌గా, మా మ్యూజిక్ యాంకర్‌గా వర్క్ చేసింది. వేదం, పైసా వంటి చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. కానీ ఆమె కెరీర్ టర్నింగ్ చేసిన షో జబర్థస్త్. యాంకర్ గా ఆ షోకే వన్నె తెచ్చింది. ఈ షోతో ఆమెకు అవకాశాలు రావడం స్టార్ అయ్యాయి. సోగ్గాడే చిన్ని నాయన మూవీతో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ బ్యూటీ.. క్షణం చిత్రంలో నెగిటివ్ రోల్‌తో కట్టిపడేసిందంతే. ఇక రంగస్థలంలో రంగమ్మత్తగా ఆమె ఫెర్ఫ్మామన్స్ టాప్ నాచ్. వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పలు చిత్రాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేసింది.

కథనం, థాంక్యూ బ్రదర్, దర్జా వంటి చిత్రాల్లో ఆమెనే హీరోయిన్. స్పెషల్ సాంగ్స్‌లో చించేసింది. ఇక పుష్పతో ఆమె రేంజ్.. పాన్ ఇండియన్ స్టాయికి చేరింది. దాక్షాయణి పాత్రలో చెమట పట్టించింది అనసూయ. మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ గ్లామరస్ డాల్.. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. రజాకార్ అనే మూవీలో కీ రోల్ ప్లే చేసింది. అది విడుదలకు సిద్దమైంది. ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా.. తనకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక భర్తతో వెకెషనల్ ట్రిప్స్, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రచ్చ లేపుతాయి అంతే.. అప్పుడప్పుడు వివాదాలు ఆమెను చుట్టుముట్టినా కుంగిపోలేదు. తన జోలికి ఎవరైనా వస్తే తాట తీసేసుద్ది. ‘ఆంటీ’ అనే పదం విషయంలో పెద్ద పోరాటమే చేసింది. చివరకు మనుషులు ఇలాగే ఉంటారని సర్ది చెప్పుకుని.. తన కెరీర్ లీడ్ చేస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom