iDreamPost
android-app
ios-app

బోయపాటిని నమ్మొచ్చా? బన్నీ లెక్కలు మారుతున్నాయా?

పుష్ప-2 సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చిన సరైనోడు సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది.

పుష్ప-2 సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చిన సరైనోడు సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది.

బోయపాటిని నమ్మొచ్చా? బన్నీ లెక్కలు మారుతున్నాయా?

టాలీవుడ్  స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. తనదైన డైరెక్షనతో ప్రేక్షకులను కట్టి పడేస్తారు. ఇక నందమూరి బాలకృష్ట, బోయపాటి కాంబినేషన్ల వచ్చే సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అంతేకాక మాస్ సినిమాలు తెరకెక్కించడంలో బోయపాటిది ప్రత్యేక  శైలి. అందుకే ఆయనతో సినిమా తీసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. బోయపాటి  తీసే సినిమాలు అయితే సూపర్ డూపర్ హిట్ అవుతాయి. లేకుంటే అంచనాలను తలకిందులు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి  ఓ సినిమాను తీయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బోయపాటిని బన్నిని నమ్మొచ్చా? అనే సందేహాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాక జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు కథనాయకుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది త్వరలోనే  ఈ సినిమా ప్రేక్షకులకు  ముందుకు రానుంది. పుష్పా సినిమా సక్సెస్ తో బన్నీ ఫుల్  జోష్ మీద ఉన్నారు.

ఆయన సినిమాల లైనప్ చూసి.. అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే తివిక్రమ్ తో బన్నీ సినిమా ఓకే అయ్యింది. అంతేకాకుండా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ తో  అల్లు అర్జున్ సినిమా తీయనున్నారు. పుష్ప సినిమా తరువాత బన్నీతో భారీ సోషియో ఫాంటసీ సినిమాను తెరకెక్కించాలని తివిక్రమ్ భావించాడని టాక్. అయితే ఆయన ప్రస్తుతం మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు.  ఆ సినిమా పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది.

అంతేకాక బన్నీ కోసం తీసే సినిమా కథ మరియు ఇతర వర్క్ కోసం త్రివిక్రమ్ ఏడాదిన్నర సమయం తీసుకొనున్నారని టాక్. ఇక పుష్ప సినిమా విడుదల తరువాత త్రివిక్రమం సినిమా తెరకెక్కాలంటే  చాలా సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను బన్నీ చేయబోతున్నాడంట. అది కూడా గీతా ఆర్ట్స్ లో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చిన సరైనోడు మూవీ మంచి హిట్ సొంతం చేసుకుంది. అలానే బోయపాటి.. బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. అంతక ముందే లెజెండ్ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవలే రామ్ తో తెరకెక్కించిన స్కంద మూవీ మిక్స్ టాక్ వచ్చింది. అంతేకాక సినిమా నిరాశ పర్చిందని పలువురు ప్రేక్షకులు సైతం చెప్పుకొచ్చారు. అయితే బోయపాటి స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన  లెజెండ్,అఖండ సినిమాలు పలు రికార్డులను సైతం తిరగరాశాయి.

అందుకే ఆయనతో సినిమా తీసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బోయపాటి తీసే సినిమాలో ఒక్కొక్కసారి అంచనాలు అందుకోవడంలో విఫలమవుతుంటాయి. అందుకు ఉదాహరణే స్కందా మూవీ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ సినిమా చేయాలి అనుకోవడం సాహస నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటిని సరిగ్గా ఉపయోగించుకుంటూ అద్భుతమైన మాస్ సినిమా వస్తుందని గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌ వారు మాట్లాడుకుంటున్నారని టాక్. మరి.. బోయపాటితో సినిమా విషయంలో బన్నీ లెక్కలు మారిపోతున్నాయా? అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş