iDreamPost
android-app
ios-app

ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ ఏమైపోయింది? ! ఇండస్ట్రీలో రాజకీయాలకి!

  • Published Aug 06, 2024 | 4:50 PM Updated Updated Aug 06, 2024 | 4:50 PM

టాలీవుడ్ లో స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారయణ తెరకెక్కించిన ఆరుగురు పతివ్రతలు సినిమా అందరికీ గుర్తేండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది. ఎందుకు సినిమాల్లో కనుమరుగైపోయిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారయణ తెరకెక్కించిన ఆరుగురు పతివ్రతలు సినిమా అందరికీ గుర్తేండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది. ఎందుకు సినిమాల్లో కనుమరుగైపోయిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 06, 2024 | 4:50 PMUpdated Aug 06, 2024 | 4:50 PM
ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ ఏమైపోయింది? ! ఇండస్ట్రీలో రాజకీయాలకి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ ల మధ్య ఊగిసలాడుతూ.. అడదడపా సినిమాల్లో అలరిస్తున్న ముద్దుగుమ్మలు కొంతమంది ఉంటే.. మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించకుండా కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మనం మాట్లాడుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. అప్పటిలో ఈమె ఒక సెన్సేషనల్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మరీ, ఆమె ఎవరో కాదు.. నటి ‘అమృత ఆనందమయి’. ఈ పేరుతో ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ, ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమాలో నటి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే.. ఈ బ్యూటీ తెలుగులో ఆ ఒక్క సినిమానే చేసింది. ఇక ఆ సినిమాను స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారయణ డైరెక్ట్ చేసి 2004లో తెరకెక్కించారు.

కానీ, నిజానికి ఈవీవీ సినిమాలన్ని కామెడీ జానర్ లో ఉంటాయి. అయితే ఈ సినిమాని మాత్రం ఈవీవీ కాస్త డిఫరెంట్ కంటెంట్ గా తెరకెక్కించారు. ఇక విషయం పక్కన పెడితే.. ఆ రోజుల్లో ఆరుగురు పతివ్రతలు సినిమా అంటే అదేదో బోల్డ్ కంటెట్ సినిమాగా కొందరు అనుకునేవారు. అలాగే మరి కొంతమంది చాలా ఆసక్తిగా చూసేవారు. ఇక ఆరుగురు పతివ్రతలు సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో అమృత చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఇటు భర్త, లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో నటించింది అనడం కంటే.. జీవించిందని చెప్పవచ్చు. అంతలా ఆ సినిమాలో అమృత తన నటనతో ప్రేక్షకులను అలరించింది. కానీ, నిజానికి అమృత కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్. ఈమె అక్కడ నుంచే తన కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా పలు సినిమాల్లో అలరించింది. అయితే అనుకోకుండా..ఈమెకు తెలుగులో ఆరుగురు పతివ్రతలు సినిమాలో అవకాశం అందుకుంది.

Aaruguru prathivrathalu heroine life

ఈక్రమంలోనే.. మొదటి సినిమాలో నటించి తెలుగునాట మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అమృతకు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా అమృత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైయింది. అయితే అమృత అలా ఇండస్ట్రీ నుంచి కనుమరగవ్వడానికి కారణం.. ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కుట్రలే అని అప్పటిలో టాక్ ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఆమెకు వచ్చే క్రేజ్ ను చూసి తట్టుకొలేని కొందరు ఇండస్ట్రీలో రాజకీయాలు చేసి ఆమెను తెలుగు ఇండస్ట్రీ నుంచి దూరమయ్యేలా చేశారని ఎక్కువగా గుసగుసలు వినిపించాయి.

కానీ, నిజానికి అమృతకు మొదటి సినిమాలో అలాంటి పాత్రలో నటించడంతో.. ఆ తర్వాత కూడా అదే తరహాలోని పాత్రాలు వచ్చాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి కన్నడలోనే కొన్ని సినిమాల్లో కొన్నాళ్లు అలరించింది. ఇలా తెలుగు, కన్నడంతో పాటు ఇతర భాషల్లో కలిపి అమృత 8 సినిమాల్లో మాత్రమే నటించింది. ఇకపోతే ఆమె చివరిగా 2009లో ‘జోడి నెంబర్ 1’ అనే కన్నడ చిత్రం ఆమె నటించింది. మరీ, ఆ తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమై అమెరికా ఎన్నారై ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. అయితే అక్కడ ఏదో కేసులో చిక్కుకోవడంతో మళ్లీ కొన్నాళ్లకు ఇండియాకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం అమృత  బెంగళూరులో తన ఫ్యామీలితో సాధరణ గృహిణీగా జీవితాన్ని గడుపుతుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş