iDreamPost
android-app
ios-app

Allu Arjun: మనసు మార్చుకున్న బన్నీ! అట్లీతో మూవీ అటకెక్కినట్లేనా?

  • Published Sep 02, 2024 | 10:18 PM Updated Updated Sep 02, 2024 | 10:18 PM

Allu Arjun, Atlee Kumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీస్ కోసం ఏ రేంజ్​లో వెయిటింగ్ ఉంటుందో తెలిసిందే. సౌత్​తో పాటు నార్త్​లోనూ ఆయన సినిమాల కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉన్న బన్నీ.. తదుపరి ఏ చిత్రంలో నటిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

Allu Arjun, Atlee Kumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీస్ కోసం ఏ రేంజ్​లో వెయిటింగ్ ఉంటుందో తెలిసిందే. సౌత్​తో పాటు నార్త్​లోనూ ఆయన సినిమాల కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉన్న బన్నీ.. తదుపరి ఏ చిత్రంలో నటిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

  • Published Sep 02, 2024 | 10:18 PMUpdated Sep 02, 2024 | 10:18 PM
Allu Arjun: మనసు మార్చుకున్న బన్నీ! అట్లీతో మూవీ అటకెక్కినట్లేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీస్ కోసం ఏ రేంజ్​లో వెయిటింగ్ ఉంటుందో తెలిసిందే. సౌత్​తో పాటు నార్త్​లోనూ ఆయన సినిమాల కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’కు ముందు వరకు బన్నీ మూవీస్ కోసం తెలుగుతో పాటు మలయాళం ఆడియెన్స్ బాగా ఎదురుచూసేవారు. కానీ ఆ ఫిల్మ్​ సూపర్​హిట్ అవడం, అల్లు అర్జున్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్​కు విస్తరించడంతో ఆయన సినిమాల కోసం ఉత్తరాదిన కూడా వెయిటింగ్ మరింత ఎక్కువైంది. ప్రస్తుతం ‘పుష్ప’ సెకండ్ పార్ట్​ షూటింగ్​తో బిజీగా ఉన్న బన్నీ.. తదుపరి ఏ చిత్రంలో నటిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ మూవీ ఉంటుందని, సన్​పిక్చర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్​లో ఈ ఫిల్మ్ రూపొందుతుందని కొన్ని నెలల కింద టాక్ వచ్చింది.

‘పుష్ప 2’ షూటింగ్ ముగిశాక బన్నీ-అట్లీ కాంబో ఫిల్మ్ సెట్స్ మీదకు వెళ్తుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఆ సినిమా పట్టాలెక్కడం కష్టమేనని వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విషయం ఎటూ తేలకపోవడంతో అట్లీ బాలీవుడ్ వైపు చూస్తున్నాడని.. అక్కడ ఒక మూవీ ఓకే కూడా అయిపోయిందని ముంబై టాక్. కండలవీరుడు సల్మాన్​ ఖాన్​తో అట్లీ ఫిల్మ్ ఓకే అయిపోయిందని.. ఫైనల్ వెర్షన్​కు సల్లూ భాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్​కు ఇద్దరు హీరోలు కావాల్సి ఉండటంతో యూనివర్సల్ యాక్టర్ క​మల్ హాసన్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రీ ప్రొడక్షన్ వర్క్​తో పాటు ఇతర పనులు పూర్తయి మూవీ పట్టాలెక్కేందుకు మరో నాలుగు నెలల టైమ్ పట్టొచ్చని వినిపిస్తోంది.

అట్లీతో ప్రాజెక్ట్ విషయంలో బన్నీ మనసు మార్చుకోవడంతోనే బాలీవుడ్ వైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సల్మాన్​తో అట్లీ మూవీ ఓకే అయినట్లు కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఇప్పుడే దీని గురించి ఏదీ చెప్పలేం. కానీ బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ అటకెక్కిందని మాత్రం సోషల్ మీడియాలో జోరుగా రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఏంటనేది త్వరలో తేలిపోతుంది. ఇక, అట్లీతో మూవీని పక్కనబెడితే.. ఆల్రెడీ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాకు ఓకే చెప్పేశాడు అల్లు అర్జున్. ఒకవేళ అట్లీతో సినిమా మిస్ అయితే త్రివిక్రమ్​తో ప్రాజెక్ట్ ముందుకు జరిగే అవకాశం ఉంది. త్రివిక్రమ్ తీసే ఫిల్మ్ పాన్ ఇండియా రేంజ్​లో​ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నందున ఎక్కువ టైమ్ పడుతుందని అనుకుంటే మధ్యలో ఇంకో డైరెక్టర్​తో బన్నీ కాంబో సెట్ అయ్యే ఛాన్సులను కొట్టిపారేయలేం. ఏదేమైనా అట్లీ ప్రాజెక్ట్ గురించి వచ్చే కన్ఫర్మేషన్​ను బట్టే ఐకాన్ స్టార్ లైనప్, రిలీజ్​ల మీద క్లారిటీ వస్తుంది. మరి.. అట్లీ-అల్లు అర్జున్ కాంబో ఫిల్మ్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş