iDreamPost
android-app
ios-app

Akhil Akkineni: చేతికి కట్టుతో.. సలార్ సక్సెస్ మీట్ లో అక్కినేని అఖిల్

  • Published Jan 16, 2024 | 6:32 PM Updated Updated Jan 16, 2024 | 6:32 PM

సలార్ టీమ్ సక్సెస్ పార్టీలో అఖిల్ అక్కినేని దర్శనమిచ్చాడు. అయితే చేతికి కట్టు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సలార్ టీమ్ సక్సెస్ పార్టీలో అఖిల్ అక్కినేని దర్శనమిచ్చాడు. అయితే చేతికి కట్టు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

  • Published Jan 16, 2024 | 6:32 PMUpdated Jan 16, 2024 | 6:32 PM
Akhil Akkineni: చేతికి కట్టుతో.. సలార్ సక్సెస్ మీట్ లో అక్కినేని అఖిల్

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సలార్ గురించి వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కు దాదాపు ఆరేళ్ల తర్వాత ఫుల్ మీల్స్ పెట్టిన చిత్రం ఇది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.625 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా తాజాగా సలార్ మూవీ టీమ్ కు ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మూవీ టీమ్ మొత్తం పాల్గొంది. వీళ్లలో ఒక వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను మరెవరో కాదు.. అఖిల్ అక్కినేని. ఆ కట్టు చూసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.

అఖిల్ అక్కినేని ఆఖరిగా తీసిన సినిమా ఏజెంట్. ఈ మూవీ సినిమా లవర్స్ ని డిజపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం అఖిల్ బాడీ ట్రాన్సఫర్మేషన్ కూడా చేశాడు. లుక్స్, స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంటూ చాలానే కష్టపడ్డాడు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత అఖిల్ మరో చిత్రం అనౌన్స్ చేయలేదు. అంతేకాకుండా ఏజెంట్ మూవీ లుక్స్ లోనే కనిపిస్తూ వచ్చాడు. ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాల్లో కూడా అదే లుక్స్ లో కనిపించాడు. తాజాగా సలార్ టీమ్ ఫంక్షన్ లో అఖిల్ కనిపించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు అఖిల్ సలార్ సినిమా పార్టీకి వచ్చాడు అంటూ పలు ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

కొందరైతే సలార్ శౌర్యాంగ పర్వంలో అఖిల్ నటిస్తన్నాడేమో అంటూ ఊహాగానాలకు తెర లేపుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అఖిల్ చేతికి పెద్ద కట్టు ఉంది. అతని ఎడమ చేతికి పెద్ద పిండి కట్టు ఉంది. అంటే అఖిల్ చేతికి బాగా గాయం అయింది. అది చిన్నది కూడా కాదు. ఫ్యాక్చర్ అయినట్లుగా ఉంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయంపై సమాచారం లేదు. షూటింగ్ లో గాయం అయి ఉంటుంది అనుకోవడానికి కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. అయితే యూవీ క్రియేషన్స్ వారితో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యూవీ క్రియేషన్స్, అఖిల్ చేయబోయే మూవీకి రామ్ చరణ్ కూడా సహ నిర్మాతగా ఉంటాడని చెబుతున్నారు. ఒకవేళ మూవీ అనౌన్స్ చేయకుండానే సైలెంట్ గా షూటి చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా చిత్రీకరణలోనే అఖిల్ చేతికి గాయం అయి ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై అక్కినేని కుటుంబం అధికారికంగా సమాచారం ఇచ్చే వరకు ఇలాంటి ఊహాగానాలు అయితే వస్తూనే ఉంటాయి. సలార్ ఫంక్షన్ లో అఖిల్ కనిపిచడం ఒక షాకింగ్ విషయం అయితే.. అఖిల్ చేతికి అంత పెద్ద కట్టు ఉండటం ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. మరి.. అఖిల్ చేతికి కట్టు ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş