iDreamPost
android-app
ios-app

పో*ర్న్ ఇండస్ట్రీలో వరుస చావులు! అడల్ట్ స్టార్స్‌కు ఏమైంది?

వరుసగా అడల్ట్ స్టార్స్ అంతా కన్ను మూస్తున్నారు. ఈ రెండు నెలల వ్యవధి కాలంలో నలుగురు పోర్న్ స్టార్స్ మరణించడంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా

వరుసగా అడల్ట్ స్టార్స్ అంతా కన్ను మూస్తున్నారు. ఈ రెండు నెలల వ్యవధి కాలంలో నలుగురు పోర్న్ స్టార్స్ మరణించడంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా

పో*ర్న్ ఇండస్ట్రీలో వరుస చావులు! అడల్ట్ స్టార్స్‌కు ఏమైంది?

అడల్ట్ స్టార్స్‌కు ఏం జరుగుతుంది. ఈ రెండు నెలల కాలంలో నలుగురు పోర్న్ స్టార్లు చనిపోవడం హాలీవుడ్ ఇండస్ట్రీలో కలవరపాటుకు గురి చేస్తోంది. జనవరి 6న తైనా ఫీల్డ్, జనవరి 24న జస్సీ జైన్, ఫిబ్రవరి 15న కాగ్నీ లిన్ కార్టర్ చనిపోగా.. తాజాగా మార్చి 1న సోఫియా లియోన్ మరణించింది. అత్యంత చిన్న వయస్సులోనే వీరంతా కన్నుమూయడం విషాదకరం. సోఫియో లియోన్ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆమె మరణానికి కారణాలు కూడా తెలియలేదు. పెరూకి చెందిన తైనా ఫీల్డ్స్ తన ఇంటిలో జనవరి 6న అచేతనంగా పడి ఉండటాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. అడల్ట్ ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయంపై ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని రోజులకే ఆమె మరణించడం గమనార్హం.

Emilly willis

జెస్సీ జేన్ కూడా మరణించగా.. డ్రగ్ ఓవర్ డోస్ అవడం వల్ల చనిపోయినట్లు నిర్ధారించారు. ఇక కాగ్నీ లిన్ కార్టర్ తన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు మరో స్టార్ పోర్న్ స్టార్ ఆసుపత్రి పాలైంది. ఎమిలీ విల్లీస్ గత నెలలో గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన ఆమె… ప్రస్తుతం మరోసారి హార్ట్  ఎటాక్‌కు గురైంది.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమిలీ డీప్ కోమాలో ఉందని, వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటుందని ఆమె తండ్రి మైఖేల్ విల్లీస్ వెల్లడించారు.  అదే సమయంలో ఓవర్ డోస్ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు కొట్టిపారేశారు.  ఎమిలీ రెండు క్రితమే అడల్ట్ ఇండస్ట్రీ నుండి రిటైర్ అయ్యిందని తెలుస్తోంది. డ్రగ్స్ బారిన పడ్డ ఆమె రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళుతుండగా.. అనారోగ్యం పాలయ్యింది.

ఇలా అడల్డ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్ అంతా వరుసగా మృతువు కబళించడం కలిచివేస్తుంది.  ఈ రంగంలో తమ శరీరాన్ని, భవిష్యత్తును త్యాగం  చేసి.. కేవలం డబ్బుల కోసం యాక్ట్ చేస్తుంటారు ఈ నటీమణులు. ఇదే సమయంలో ఒత్తిళ్లకు గురౌతుంటారు. ఇవే వారిని డ్రగ్స్‌కు బానిసలు చేస్తున్నాయి. ఇండస్ట్రీలోని కాంపిటీషన్, ఇతర కారణాలు వెరిసి విపరీతమైన ఒత్తిడి గురౌతున్నారు. అదే సమయంలో డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు పాలౌతున్నారు. కొంత మంది ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ అత్యంత చిన్న వయస్సులోనే ఈ పోర్న్ స్టార్ మృత్యువును ముద్దాడుతున్నారు. దీంతో అసలే ఈ అడల్ట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.