iDreamPost
android-app
ios-app

వివాహ బంధం‌లోకి అడుగుపెట్టిన సినీ నటి..!

  • Published Dec 28, 2023 | 11:10 AM Updated Updated Dec 28, 2023 | 11:10 AM

వెండితెర, బుల్లితెర నటీనటులు చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మద్య సినీ తారలు చాలా మంది వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

వెండితెర, బుల్లితెర నటీనటులు చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మద్య సినీ తారలు చాలా మంది వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

  • Published Dec 28, 2023 | 11:10 AMUpdated Dec 28, 2023 | 11:10 AM
వివాహ బంధం‌లోకి  అడుగుపెట్టిన సినీ నటి..!

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలో మోగుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇందులో పెద్దలు కుదర్చిన వివాహాలు కొన్నైతే.. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నవారు మరికొంతమంది. సాధారణంగా సినీ, బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన వారు తమ సహ నటులను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ స్విని ఖరా తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. వీరి వివాహం రాజస్థాన్‌లోని జైపూర్ లో ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించి తర్వాత పలు మూవీలో నటించింది స్విని ఖరా. తర్వాత బుల్లితెరపై కూడా తన సత్తా చాటింది. 2005లో విద్యాబాలన్ నటించిన పరిణితతో బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, టబు, పరేష్ రావల్ ముఖ్యపాత్రలో నటించిన చీనీ కమ్ మూవీలో సెక్సీ అనే అబ్బాయి పాత్రలో బాలనటుడిగా నటించింది. ఆ తర్వాత జాన్ అబ్రహం నటించిన ఎలాన్, హరిపుత్తర్, షామిత్ కపూర్ నటించిన పాఠశాల, డిల్లీ సఫారి, ఎంఎస్ ధోనీ మూవీస్ లో నటించింది. అంతేకాదు ధరి కా వీర్ యోదా ఫృథ్విరాజ్ చౌహాన్, దిల్మిల్ గయే, సీఐడీ, జిందగీ బట్టి మిథీ వంటి షోటు చేసింది.

ఇండస్ట్రీలో బాలనటిగా కెరీర్ ఆరంభించిన స్విని ఖారా తర్వాత సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తున్న స్విని ఖరా ఎల్ఎల్ బీ పూర్తి చేయడానికి నటనకు స్వస్తి చెప్పింది. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ఉర్విష్ దేశాయ్ ని ప్రేమించింది. వీరిద్దరి వివాహానికి పెద్దలు ఒప్పుకున్నారు.. ఈ క్రమంలోనే ప్రేమించిన ప్రియుడితో ఏడడుగులు నడిచింది. ఈ వివాహ మహోత్సవానికి పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మాద్యమాల వేధికగా పంచుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Swini Khara (@swinikhara)