iDreamPost
android-app
ios-app

అవినీతి కేసులో కోలీవుడ్ నటి జయలక్ష్మికి బెయిల్!

  • Published Feb 24, 2024 | 4:56 PM Updated Updated Feb 24, 2024 | 4:56 PM

Jayalakshmi Get Bail: సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఫేమ్ ని వాడుకొని కొంతమంది నటీనటులు పలు అన్యాయాలు, అక్రమాలకు పాల్పపడటం.. పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం.

Jayalakshmi Get Bail: సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఫేమ్ ని వాడుకొని కొంతమంది నటీనటులు పలు అన్యాయాలు, అక్రమాలకు పాల్పపడటం.. పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం.

అవినీతి కేసులో కోలీవుడ్ నటి జయలక్ష్మికి బెయిల్!

వెండితెరపై ఒక్క ఛాన్స్ కోసం కోట్ల మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ప్రతిరోజూ స్టూడియోల వెంట తిరుగుతుంటారు.  టాలెంట్ ఉండి.. దానితో పాటు అదృష్టం ఉన్నవాళ్లకు ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తుంది. కొంతమంది నటీనటులు అతి తక్కువ కాలంలో బాగా ఫేమస్ అవుతుంటారు. అలా ఫేమస్ అయిన నటీనటులు తమ ఇమేజ్ ని రక రకాలుగా ఉపయోగించుకుంటారు. కొంతమంది సెలబ్రెటీలు స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ అక్రమాలకు పాల్పపడుతున్నారని పలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తమిళ నటి, బీజేపీ నేత జయలక్ష్మి చీటింగ్ కేసులో తిరుమంగళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

గత నెల 20 న చెన్నై అన్నార్ నగర్ లో తమిళనాడు స్నేహం ఫౌండేషన్ కు సంబంధించిన అవినీతి కేసులో నటి, బిజెపీ కార్య నిర్వాహకురాలు జయలక్ష్మిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. గత కొంత కాలంగా తమిళ గీత రచయిత స్నెగన్, నటి జయలక్ష్మి కి మధ్య వివాదం నడుస్తుంది. తనను మోసం చేశారంట ఒకరిపై ఒకరు ఫిర్యాదలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. నటుడు, గీత రచయిత స్నేహన్ మక్కల్ నిది మయ్యం ‘స్నేహం ఫౌండేషన్’ పేరిట ఒక ట్రస్టు నిర్వహిస్తున్నాడు. నటి జయలక్ష్మి మరో ట్రస్ట్ అదేపేరు పెట్టి లక్షలు, కోట్ల విరాళాలు సేకరించిందని ఆమెపై 2022 లో చెన్నై మెట్రో పాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో ఇరువురి మధ్య పెద్ద వివాదం నడుస్తుంది.

ఇదిలా ఉంటే..  మనీ లాండరింగ్ కేసులో చెన్నై అన్నానగర్ లో నటి జయలక్ష్మి ఇంట్లో సోదాలు నిర్వహంచారు పోలీసులు. ఈ సోదాల్లో పదిమందిపైగా అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిరుమంగళం పోలీసులు జయలక్ష్మిని అరెస్ట్ చేశారు. చీటింగ్, డాక్యుమెంటర్ల ఫోర్జరీ చేసిన నేరంపై పలు సెక్షన్ల కింద కేసు నమదు చేశారు.  ఈ క్రమంలోనే ఆమె బెయిల్ పై కోర్టులో పిటీషన్ వేశారు. శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. ఒక నటి, మహిళా నాయకురాలైన ఉండి.. ఇలా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.