iDreamPost
android-app
ios-app

దర్శన్ మంచోడే.. కానీ ఆ బలహీనత ఉంది.. నటి కామెంట్స్

అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ నటుడు, డీ బాస్ దర్శన్ తూగదీపకు జ్యూడిషీయల్ కస్టడి విధించింది కోర్టు. ఆయన్ను కూడా బెంగళూరులోని పరప్పన జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఆయనకు ఉన్న సమస్య గురించి పేర్కొంది ఓ నటి.

అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ నటుడు, డీ బాస్ దర్శన్ తూగదీపకు జ్యూడిషీయల్ కస్టడి విధించింది కోర్టు. ఆయన్ను కూడా బెంగళూరులోని పరప్పన జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఆయనకు ఉన్న సమస్య గురించి పేర్కొంది ఓ నటి.

దర్శన్ మంచోడే.. కానీ ఆ బలహీనత ఉంది.. నటి కామెంట్స్

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ టాప్ హీరో, డీ బాస్ దర్శన్ తూగదీప అరెస్టు కావడం చందన సీమలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రియురాలి కోసం చేతికి రక్తపు మరకలు అంటించుకున్నాడు. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడతో పాటు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే పవిత్ర గౌడ పోలీసు కస్టడీ ముగియడంతో 14 రోజుల జ్యూడిషీయల్ రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం బెంగళూరులో పరప్పన అగ్రహార జైలులో ఉంది. ఇదిలా ఉంటే.. దర్శన్ తూగదీపకు శనివారంతో పోలీసుల కస్టడీ ముగిసిపోవడంతో.. స్థానిక కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.  ఆయనతో పాటు నలుగురు నిందితులకు జులై 4 వరకు జ్యూడిషీయల్ కస్టడీకి అప్పగించింది. దీంతో వీళ్లను కూడా పరప్పన జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటే దర్శన్ అరెస్టుపై తోటి నటీనటులు భిన్నంగా స్పందిస్తున్నారు. కిచ్చా సుదీప్.. నిందితులకు శిక్ష పడాలని, రేణుకా స్వామి కుటుంబానికి న్యాయం జరగాలని తెలిపాడు. అలాగే.. ఉపేంద్ర కూడా స్పందించాడు.  కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య నెగిటివ్‌గా స్పందిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ప్రజలను కొట్టడం, చంపడం చేయొద్దు అంటూ ఇన్ స్టాలో పోస్టు చేసింది. అయితే కొంత మంది నటీమణులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. సంజనా గల్రానీ కూడా పాజిటివ్‌గా స్పందించింది. ఇప్పుడు మరో నటి కూడా అనూషా రాయ్ కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అతడు అరెస్టు కావడాన్ని నమ్మలేకపోతున్నానని చెబుతుంది ఈ బ్యూటీ.

‘దర్శన్ సెట్లో అందరినీ కేరింగ్‌గా చూసుకుంటాడు. కాకపోతే ఆయన అప్పుడప్పుడు కోప్పడుతుంటారు. అదెక్కడో ఆయనకు ఉన్న పెద్ద సమస్య. అదే అతడి బలహీనత. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడను. తనకు ఈ సమస్య ఉందని దర్శన్ గతంలో ఓ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అయితే ఈ కేసుకు దర్శన్‌కి సంబంధం ఉందనే విషయం మాత్రం నాకు తెలియదు. దర్శన్‌పై కోపం ఉంటే ఆయన్ను అనుకోండి కానీ.. నటుడి భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదు. అలా చేస్తే క్ష‌మించ‌రాని నేరం అవుతుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఆ కుటుంబాన్ని మ‌రింత క్షోభ‌కి గురి చేసిన‌ట్లు అవుతుంది’ అని అనుష రాయ్‌ చెప్పుకొచ్చింది.  రేణుకా స్వామి హత్య కేసులో జూన్ 11 నుండి పోలీసు కస్టడీలో ఉన్న దర్శన్.. ఇప్పుడు జైలుకు వెళ్లాడు.