iDreamPost
android-app
ios-app

Anjali Patil: వాళ్ల చేతుల్లో లక్షలు పొగొట్టుకున్న అవార్డు విన్నింగ్ తెలుగు నటి!

  • Published Jan 03, 2024 | 10:16 AM Updated Updated Jan 03, 2024 | 12:59 PM

ఈజీ మనీ కోసం ఈ మద్య కొంతమంది ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కేటుగాళ్ల వలలో చిక్కుకొని లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు.

ఈజీ మనీ కోసం ఈ మద్య కొంతమంది ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కేటుగాళ్ల వలలో చిక్కుకొని లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు.

  • Published Jan 03, 2024 | 10:16 AMUpdated Jan 03, 2024 | 12:59 PM
Anjali Patil: వాళ్ల చేతుల్లో లక్షలు పొగొట్టుకున్న అవార్డు విన్నింగ్ తెలుగు నటి!

ఈ మధ్య కొంతమంది కేటుగాళ్ళు కష్టపడకుండా ఈజీ మనీ కోసం ఎన్నో రకాల అక్రమాలకు తెగబడుతున్నారు. చైన్ స్నాచింగ్, డ్రగ్స్ వ్యాపారం, అక్రమాయుధాలు, స్మగ్లింగ్, బెదిరించి డబ్బు వసూళ్ల చేయడం, హైటెక్ వ్యభిచారం.. ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ ఎంతోమందిని మోసం చేస్తున్నారు. కొంతమంది తమ మాట వినకుంటే హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఉన్నచోటే కూర్చొని లక్షలు, కోట్లు మాయం చేస్తున్నారు. ఇలాంటి వారి చేతుల్లో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీ, వ్యాపార దిగ్గజాలు కూడా మోసపోతున్నారు. ఓ ప్రముఖ నటి సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి దారుణంగా మోసపోయింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు, హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో నటించిన ఎన్నో అవార్డులు గెలుచుకుంది ప్రముఖ నటి అంజలి పాటిల్. టాలీవుడ్ లో నా బంగారు తల్లి చిత్రంలో లీడ్ రోల్ లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత అంజలి పాటిల్ మరో తెలుగు మూవీలో నటించలేదు. వరుసగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటిస్తుంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అంజలి దారుణంగా మోసపోయి లక్షలు పోగొట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే.. అంజలి పాటిల్ కి డిసెంబర్ 28 న దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి ఒక కాల్ వచ్చింది. ఫేడ్ ఎక్స్ ఉద్యోగి అంటూ దీపక్ తనను పరిచయం చేసుకున్నాడు. అంజలి పాటిల్ అనే పేరుతో ఉన్న ఒక పార్సిల్, డ్రగ్స్ తో తైవాన్ లో పట్టుబడిందని అన్నాడు. ఆ పార్సిల్ లో ఆధార్ కార్డు కూడా ఉందని అన్నాడు. దీంతో ఒక్కసారే షాక్ కి గురైంది అంజలి.

A popular actress who has earned millions

ఎవరో తన ఆధార్ కార్డు ని దుర్వినియోగం చేస్తున్నారని భయపడిపోయింది.. వెంటనే తాను సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేస్తానని సదరు వ్యక్తితో చెప్పింది. కొద్ది సేపటి తర్వాత సైబర్ క్రేైమ్ నుంచి బెనర్జీని మాట్లాడుతున్నా అంటూ మరోవ్యక్తి అంజలికి కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డుకు 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి.. అవి ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుపోయాయి అంటూ బెదిరించాడు. వాటిని ఫ్రీజ్ చేయించాలంటే రూ.96,525 పంపించాలని అంజలితో చెప్పాడు. అప్పటికే భయపడిపోయిన అంజలి పాటిల్ అతడు చెప్పిన అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ వర్ చేసింది. తర్వాత ఇన్వేస్టిగేషన్ జరుగుతుంది.. దీనికోసం రూ.4,83,291 డబ్బు పంపించాలని అన్నాడు. అలా పంపించిన అంజలికి తర్వాత అనుమానం వచ్చింది.. తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.