iDreamPost
android-app
ios-app

Vijayakanth: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

  • Published Dec 28, 2023 | 9:12 AM Updated Updated Dec 28, 2023 | 10:20 AM

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2020 లో కరోనా ప్రభావంతో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు కన్నుమూశారు.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2020 లో కరోనా ప్రభావంతో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు కన్నుమూశారు.

Vijayakanth: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు విజయ్ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి మాస్ ప్రేక్షకులను మెప్పించారు. 1979 లో ఇనిక్కుం ఇలామై సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విజయ్ కాంత్ ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా డ్యూయెల్ రోల్, పవర్ ఫుల్ పోలీస్ పాత్రల్లో నటించి మెప్పించారు. నటుడిగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లో కి అడుగు పెట్టారు. సొంతంగగా  దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) పార్టీని స్థాపించి రాజకీయంగా తనదై మార్క్ చాటుకున్నారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం మరోసారి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ కన్నమూశారు. వివరాల్లోకి వెళితే..

సోమవారం విజయ్ కాంత్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో భార్య ప్రేమలత మంగళవారం చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనను పరీక్షించగా కరోనా పాజిటీవ్ అని నిర్ధారించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని.. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారని తెలిసింది. నేడు  ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తమిళ ఇండస్ట్రీల ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అభిమానులు, కార్యకర్తలు బోరున విషాదంలో మునిగిపోయారు. తమిళ ఇండస్ట్రీలో హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే డీఎండీకే పార్టీ స్థాపించి రాజకీయాల్లో తనదైన దూకుడు కొనసాగించారు. పార్టీ స్థాపించిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. మధురైలో కె.ఎన్.అలగర్‌స్వామి, ఆండాళ్ అలగార్ స్వామి దంపతులకు ఆగస్టు 25, 1952 న జన్మించారు విజయ్ కాంత్. 1990లో, జనవరి 31 న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్. ఆయన రెండవ కుమారుడు షణ్ముగ 2014లో సగప్తాహం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో పార్టీ వ్యవహారాలు అన్నీ ఆయన సతీమణి ప్రేమలత చూసుకుంటున్నారు. గత నెల ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్య రావడంతో చెన్నైలోని మీరట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయనపై రక రకాల రూమర్లు పుట్టుకువచ్చాయి. ఒకదశలో విజయ్ కాంత్ ఇక లేరు అన్న వార్తలు రావడంతో ఆయన సతీమణి ప్రేమలత తీవ్రంగా ఖండించారు. పుకార్లు నమ్మవొద్దని విజయ్ కాంత్ తో కలిసి ఉన్న వీడియో, ఫోటో ఫుటేజ్ లను సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అభిమానులు, కార్యకర్తలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2020లో విజయ్ కాంత్ కి కరోనా వచ్చినప్పటికీ బతికి బయటపడ్డారు. తాజాగా మరోసారి ఆయనకు కరోనా పాజిటీవ్ రావడంతో అభిమానుల, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని కోరుకున్నారు.. కానీ అంతలోనే ఆయనను మృత్యువు వెంటాడింది. ఒకసారి కరోనా భారి నుంచి బతికి బయటపడ్డా.. రెండోసారి తప్పించుకోలేకపోయారు. విజయ్ కాంత్ మృతితో సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.