P Krishna
సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తుంటార. కానీ ఇక్కడ కొంతమంది నటీనటుల కెరీర్ ఎప్పుడు ఊపు అందుకుంటుందో.. ఎప్పుడు దిగజారి పోతుంతో చెప్పలేరు. కెరీర్ లో సక్సెస్ కాలేని వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నటులు చాలా మంది ఉన్నారు.
సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తుంటార. కానీ ఇక్కడ కొంతమంది నటీనటుల కెరీర్ ఎప్పుడు ఊపు అందుకుంటుందో.. ఎప్పుడు దిగజారి పోతుంతో చెప్పలేరు. కెరీర్ లో సక్సెస్ కాలేని వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నటులు చాలా మంది ఉన్నారు.
P Krishna
సినిమా, బుల్లితెర ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం అనుకుంటారు.. కానీ ఇక్కడ కూడా కన్నీటీ కష్టాలు ఉంటాయని పలువురు నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. కొంతమంది కెరీర్ ని ఎదగకుండా చేస్తుంటారని బాధపడుతుంటారు.బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకొని వెండి తెరపై అడుగు పెట్టి ఏమాత్రం సక్సెస్ సాధించలేక కెరీయర్ కి గుడ్‌బై చెప్పిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే 2020 లో వచ్చిన కరోనా ఇండస్ట్రీపై ఎంతో ప్రభావం చూపించింది.. అప్పట్లో బుల్లితెర, వెండి తెరకు సంబంధించిన నటులు చిన్న చిన్న వ్యాపారాలు, వ్యవసాయం చేసుకోవడం మొదలు పెట్టారు. అలా ఓ నటుడు తన కెరీర్ సరిగా సాగక.. అన్నీ కోల్పాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపై తన నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు రాజేశ్ శర్మ. కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ.. రాను రాను ఛాన్సులు దూరమైపోతూ వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక కర్షకుడిగా మారిపోయాను అంటున్నాడు రాజేశ్ శర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2017 లో నేనునటన మానేద్దామని ఫిక్స్ అయ్యారు.. ఈ క్రమంలోనే మాకు ఉన్న వ్యవసాయం గుర్తుకు వచ్చి మా నాన్నతో నేను వ్యవసాయం చేసి పండిస్తాను అని చెప్పాను. మొదట మా నాన్న వినలేదు.. కానీ నేను అనుకున్నది చేసి చూపించాను. మొదట నా నిర్ణయం ఊరి వారికి చెబితే కామెడీ అనుకున్నారు.. కానీ నేను నిజంగా రైతుగా మారి పొలం పండిస్తుంటే ఆందరూ మెచ్చుకున్నారు.
నేను రైతుగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఇండస్ట్రీలో నటీనటులు చాలా ఇబ్బంది పడ్డారు. వారిలో నేనూ ఒకరిని.. లాక్ డౌన్ లో నేను దాచుకున్న సొమ్మంతా పోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు.. బుల్లితెర ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ పడింది. ఒకదశలో నేను పూర్తిగా దివాలా తీశాను. అప్పులు ఎక్కువ కావడంతో నాపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆ సమయంలో నేను చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా పిల్లలు నన్ను రైతుగా మారిన నటుడు అంటే ఎంతో గర్వంగా ఉంది. నాకు నచ్చినవి పండిస్తాను, వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నాను.. ఎవరికీ తలొంచి పనిచేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు నటుడు రాజేశ్ శర్మ. ‘సారా బాయ్ వర్సెస్ సారాభాయ్’ సీరియల్ లో మంచి పేరు సంపాదించాడు రాజేశ్ శర్మ. ఇటీవల ఈ సీరియల్ నటులు పెద్ద పార్టీ కూడా చేసుకున్నారు.