టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించిన సంగతి తెలిసిందే. నవదీప్ ను సుమారు 8 గంటలపాటు విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(టీన్యాబ్) నవదీప్ ను విచారించగా.. తాజాగా ఈడీ కూడా అతడిని సుధీర్ఘంగా విచారించింది. 8 గంటలపాటు సాగిన ఈ సుధీర్ఘ విచారణలో.. డ్రగ్స్ కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి నవదీప్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో నవదీప్ మాట్లాడుతూ.. ఈడీ విచారణపై వివరణ ఇచ్చారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈడీ విచారణకు హాజరైన అతడు మంగళవారం మీడియాతో మాట్లాడకుండానే హడావిడిగా వెళ్లిపోయారు. కాగా.. ఈడీ విచారణపై తాజాగా వివరణ ఇచ్చారు నవదీప్. ‘సగిలేటి కథ’ మూవీ రేపు(అక్టోబర్ 13)న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు నవదీప్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే సగిలేటి కథ ప్రీమియర్ షోను ప్రసాద్ ల్యాబ్ లో మీడియాకు ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం పలు విషయాలు చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా హీరో నవదీప్ కు ఈడీ విచారణ గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. వాటికి సమాధానాలు ఇచ్చారు. “ఇది కేవలం విచారణ మాత్రమే. వారు ఏ ప్రశ్నలు అయితే అడిగారో వాటికి నేను స్పష్టంగా ఆన్సర్లు ఇచ్చాను. 2017, 2022లో జరిగిన దానికి, ఇప్పటికి కేసుకు సంబంధం ఏంటి? అని అడిగారు. ఈడీ, సిట్ రెండు వేర్వేరు శాఖలు విచారణకు పిలవడంతో.. రెండు సార్లు హాజరైయ్యాను” అని వివరణ ఇచ్చారు నవదీప్. ఇక తన బ్యాంక్ వివరాలను తీసుకెళ్లి చూపించినట్లు సమాచారం.