P Krishna
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కొంతమంది సెలబ్రెటీలు, రాజకీయ నేతలు పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కొంతమంది సెలబ్రెటీలు, రాజకీయ నేతలు పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
P Krishna
బాల్యంలో కొన్ని కారణాల వల్ల చదువుకు దూరం అయినప్పటికీ.. అదృష్టం కొద్ది గొప్ప స్థానానికి వచ్చినవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఉన్నారు. అలాంటి వారు వయసుతో నిమిత్తం లేకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. వింటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. ఓ నటుడు తన 65వ ఏట పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్దమయ్యారు. సదరు నటుడు ఇప్పటి వరకు దాదాపు 550 పైగా చిత్రాల్లో నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కే సురేంద్రన్.. ఇండస్ట్రీలో అతని పేరు ఇంద్రన్స్ గా సుపరిచితుడు. మాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. గతంలో ఆయన క్యాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగారు. 1981లో కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో సీఐడీ ఉన్ని కృష్ణన్ బీఏ, బీఈడి అనే కామెడీ చిత్రంతో ఇంద్రన్స్ కి మంచి పేరు వచ్చింది. తర్వాత స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం లభించింది. ఇంద్రన్స్ తన 65 ఏట 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ఆయన నటనకు గాను జాతీయ, రాష్ట్ర చలన చిత్ర అవార్డులు గెల్చుకున్నారు. తన నాలుగో ఏట ఆర్థిక కష్టాల వల్ల చదువు మానేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు టెన్త్ ఈక్వలైజేషన్ పరీక్షకు హాజరయ్యేందుకు సిద్దమవుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను పదవ తరగతి క్లాసులకు హాజరవుతున్నా అని తెలిపారు. నటుడు నిరక్షరాస్యుడిగా ఉండటం అంట.. అంధుడితో సమానం అని అన్నారు. ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూడాలని అనుకుంటున్నా అని అన్నారు. తాను పదవ తరగతి పరీక్ష ఎలాగైనా పాస్ అవుతా అని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంద్రన్.
1990 నుంచి 2000 వరకు ఎన్నో కామెడీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆలోరుక్కంలోని ఇంద్రన్స్ నటనకు కేరళా రాష్ట్ర చలన చిత్ర పురస్కారం ఉత్తమ నటుడిగా, వెయిల్ మరంగల్ మూవీలో నటించినందుకు గాను 2019 సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. 2023 లో హూమ్ లొ అతని నటనకు జాతీయ చలన చిత్ర అవార్డు కైవసం చేసుకున్నారు. ప్రముఖ నటులు మోహన్ లాల్, మమ్ముట్టి నటించిన చిత్రాల్లో ఇంద్రన్ తన కామెడీ మార్క్ చాటుకున్నారు.