iDreamPost
android-app
ios-app

Fahadh Faasil: అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్‌.. జీవితాంతం భరించాల్సిందే అంటూ

  • Published May 28, 2024 | 8:25 AM Updated Updated May 28, 2024 | 8:25 AM

పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాక.. పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఫహద్‌ ఫాజిల్‌ తాజాగా షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించాడు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాక.. పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఫహద్‌ ఫాజిల్‌ తాజాగా షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించాడు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

  • Published May 28, 2024 | 8:25 AMUpdated May 28, 2024 | 8:25 AM
Fahadh Faasil: అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్‌.. జీవితాంతం భరించాల్సిందే అంటూ

ఫహద్‌ ఫాజిల్‌.. కరోనా ముందు వరకు ఇతడి గురించి కేవలం మలయాళ ప్రేక్షకులు.. ఆ సినిమాలు చూసే వారికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే లాక్‌డౌన్‌లో ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిందో.. దాంతో మలయాళ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో సందడి చేయడం ప్రారంభించాయి. వాటిల్లో ఫహద్‌ సినిమాలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో అంటే 6 అడుగుల ఎత్తు.. మంచి ఫిజిక్‌ ఉండాలి.. అనే దానికి భిన్నంగా సాదా సీదా కుర్రాడిలా ఉంటూ.. బట్టతలను కూడా ఏమాత్రం దాచుకోకుండా కనిపించే సింప్లిసిటీ ఫహద్‌ సొంతం. ప్రేక్షకులకు నచ్చాల్సింది.. నటన తప్ప మన రూపు కాదు అని బలంగా నమ్మిన ఫహద్‌.. తన విషయంలో అదే నిజమని నిరూపించుకున్నాడు. తెర మీద తన నట విశ్వరూపం చూపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మలయాళ సినిమాలు అన్ని తెలుగులోకి డబ్‌ కావడంతో.. ఇక్కడ కూడా ఫహద్‌కి భారీ ఎత్తున ఫాలోయింగ్‌ పెరిగింది. దాంతో సుకుమార్‌, అల్లు అర్జున్‌.. పుష్ప సినిమాలో అవకాశం దక్కింది. పార్టీ లేదా పుష్ప అంటూ.. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఫహద్‌.

పుష్ప సినిమాలో ఫహద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. పుష్ప 2లోనూ ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆవేశం సినిమాతో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నటుడు. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఫహద్‌.. అవకాశం వస్తే.. ఇతర భాషా చిత్రాల్లో కూడా అదే స్థాయిలో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య గురించి వెల్లడించి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు ఫహద్‌. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని.. ప్రారంభంలోనే గుర్తిస్తే తగ్గేదని.. కానీ ఇప్పుడు లాభం లేదని.. జీవితాంతం ఆ వ్యాధిని భరించాల్సిందే అన్నాడు. ఆ వివరాలు..

ఇటీవల ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఫహద్‌.. తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అభిమానులకు భారీ షాక్‌ ఇచ్చాడు. కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఫహద్ తాను ఏడీహెచ్‌డీ వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చాడు. ఇంతకు ఏంటీ ఏడీహెచ్‌డీ అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్. అయితే అనూహ్యంగా తాను 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పుకొచ్చాడు ఫహద్‌. మరి దీనికి చికిత్స ఉందా అని ప్రశ్నిస్తే.. చిన్నతనంలోనే ఈ వ్యాధి బయట పెడితే క్యూర్ చేయచ్చని, కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడిందని.. ఇక తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని చెప్పుకొచ్చాడు.

 ఏడీహెచ్‌డీ లక్షణాలు ఇవే..

వైద్య నిపుణుల ప్రకారం ఏడీహెచ్‌డీతో సతమతమయ్యే వారికి ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదు. హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్, ఇంప‌ల్సివిటీ లాంటి లక్షణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వారే క్రియేటివ్‌గా ఉండాలనుకుంటారు. సైకలాజికల్‌గా ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని వైద్యులు వెల్లడించారు.