iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడి ఇంట తీవ్ర విషాదం.. ఒకేరోజు సోదరి- సోదరుడు మృతి!

  • Author Soma Sekhar Published - 12:12 PM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Published - 12:12 PM, Sat - 24 June 23
ప్రముఖ నటుడి ఇంట తీవ్ర విషాదం.. ఒకేరోజు సోదరి- సోదరుడు మృతి!

సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ విషాదం మాటలకందనిది. ప్రముఖ సీనియర్ నటుడి సోదరి, సోదరుడు ఒకే రోజు చనిపోయారు. దాంతో ఇండస్ట్రీ మెుత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. గత కొన్ని నెలలుగా పరిశ్రమలో తరచుగా విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ విషాదం మాత్రం తీరని శోకాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఒకే రోజు చెల్లి, సోదరి చనిపోవడంతో ఆ నటుడు దిగ్బ్రాంతికి గురైయ్యారు. చెల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న సోదరుడు.. ఆమె చితిపైనే పడి హర్ట్ ఎటాక్ తో చనిపోయారు.

యాక్టర్ బోస్ వెంకట్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ తమిళనాడులో ఆయన గుర్తింపు పొందిన మంచి నటుడు. బుల్లితెర నుండి వెండితెరకు ఎన్నో కష్టాలు పడి మంచి యాక్టర్ గా ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఓవైపు నటిస్తూనే.. మరోవైపు దర్శకత్వం కూడా చేస్తున్నారు బోస్ వెంకట్. తాజాగా ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు ఆయన చెల్లెలు వలర్మతి, సోదరుడు రంగనాథ్ ఇద్దరూ మరణించారు.

ఇక ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీ మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బోస్ వెంకట్ సోదరి వలర్మతి శుక్రవారం గుండెపోటుతో చెన్నైలో మరణించారు. ఈ వార్త తెలియడంతో.. సోదరుడు రంగనాథ్ అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అరన్ తంగి ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. సోదరి సమాధిపై పడి విలపిస్తూ.. ఉండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ కు గురైయ్యారు. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఒకే రోజు రెండు మరణాలు, ఒకే ఇంట్లో అంటే ఆ బాధ వర్ణాణాతీతం అనే చెప్పాలి. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు వెంకట్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.