iDreamPost
android-app
ios-app

Subrahmanyaa: డైరెక్టర్ గా మారిన ప్రముఖ యాక్టర్.. కొడుకుతో ఏకంగా పాన్ ఇండియా మూవీ!

  • Published Aug 31, 2024 | 1:46 PM Updated Updated Aug 31, 2024 | 1:46 PM

Ravi Shankar directing his son's debut film Subrahmanyaa pre-look poster released: ప్రముఖ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్ తన కొడుకుతో ఏకంగా ఓ పాన్ ఇండియా మూవీని తీస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

Ravi Shankar directing his son's debut film Subrahmanyaa pre-look poster released: ప్రముఖ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్ తన కొడుకుతో ఏకంగా ఓ పాన్ ఇండియా మూవీని తీస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

Subrahmanyaa: డైరెక్టర్ గా మారిన ప్రముఖ యాక్టర్.. కొడుకుతో ఏకంగా పాన్ ఇండియా మూవీ!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. దానిపేరు ‘పాన్ ఇండియా’. అవును.. ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా మూవీస్ పైనే దృష్టిపెడుతున్నారు. డైరెక్టర్లు సైతం ఇలాంటి కథలతోనే వారి దగ్గరకు వెళ్తున్నారు కూడా. స్టార్ హీరోలే కాదు.. చిన్న, అప్ కమింగ్ హీరోలు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇదే కోవలోకి చేరబోతున్నాడు ఓ ప్రముఖ యాక్టర్ కొడుకు. భారతీయ చిత్ర పరిశ్రమలో యాక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల, వేల చిత్రాలకు తన గొంతును అందించిన గుర్తింపు తెచ్చుకున్నాడు రవి శంకర్. ఇక ఇప్పుడు మెగాఫోన్ పట్టి.. తన కొడుకుతోనే పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

రవి శంకర్.. సాయి కుమార్ సొదరుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైయ్యాడు. తన గంభీరమైన వాయిస్ తో వేల సినిమాలకు డబ్బింగ్ చెప్పి.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు దర్శకుడిగా మారి తన కొడుకునే హీరోగా పెట్టి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. గతంలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ రాగా.. ఇప్పుడు ఆ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘సుబ్రహ్మణ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో రవి శంకర్ కొడుకు అధ్వయ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రీ లుక్ పోస్టర్ కు విశేషమైన స్పందన వస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అది కూడా ఐమ్యాక్స్ వెర్షన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తిరుమల రెడ్డి, అనీల్ కడియాల నిర్మిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఫాంటసీ అండ్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.