iDreamPost
android-app
ios-app

రామ్‌‌చరణ్‌తో సంయుక్తంగా అభిషేక్‌ అగర్వాల్‌ సంచలన చిత్రం ‘ది ఇండియా హౌస్‌’

  • Published Jan 10, 2024 | 3:47 PM Updated Updated Jan 10, 2024 | 5:44 PM

Abhishek Agarwal: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

Abhishek Agarwal: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

  • Published Jan 10, 2024 | 3:47 PMUpdated Jan 10, 2024 | 5:44 PM
రామ్‌‌చరణ్‌తో సంయుక్తంగా అభిషేక్‌ అగర్వాల్‌ సంచలన చిత్రం ‘ది ఇండియా హౌస్‌’

భారతదేశ చరిత్రలో ఇండియా హౌస్ కి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర సమరంలో విదేశీ గడ్డపైన దేశ స్వాతంత్యం కోసం సమరసంఖం పూరించిన చోటుగా ఇండియాహౌస్ ఒక సంచలన స్థానంగా చరిత్రపుటలలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. సవార్కర్, భీకాజీ కామా, విఎన్ ఛటర్జీ, ఎంపిటి ఆచార్య, లాలా హరదయాళ్ వంటి ప్రముఖమైన పేర్లు ఇండియా హౌస్ అనే చోటుతో చాలా గట్టిగా ముడిపడి ఉన్నాయి. 1905 నుంచి 1910 వరకూ నార్త్ లండన్లో హై గేట్ అనే ప్లేస్ లో క్రోమ్ వెల్ అవెన్యూ అనే ప్రదేశంలో స్టూడెంట్స్ ఉండే నివాసం పేరే ఇండియా హౌస్ గా గుర్తింపు పొందింది.

రాజకీయ చైతన్యం, ఇండియన్ ఫ్రీడమ్ రివల్యూషన్ కి సంబంధించినంత వరకూ విదేశీ గడ్డపై అత్యంత కీలకమైన దశలకు ఇండియా హౌస్ ఒక సంచలన వేదికగా నిలిచింది. ఇందులో మళ్ళీ అతి ప్రముఖమైన పాత్రను పోషించిన వీర సవార్కర్ 140వ జయంతిని పురస్కరించుకుని ధి ఇండియా హౌస్‌ అనే పాన్‌ ఇండియా సినిమాని ప్రారంభిస్తున్నట్టుగా గత సంవత్సరం మే 28న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేసి మరీ అందరికీ ఓ కొత్తవార్తను పరిచయం  చేశారు.

ఇందులో కార్తికేయ-2 తో భారతదేశమంతా పరిచయమైన నిఖిల్‌ సిద్ధార్ర్ ప్రధానమైన భూమికను పోషిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలకమైన మరో పాత్రను ధరిస్తున్నారు. నూతన దర్శకుడు రామ్‌ వంశీకృష్ణ ది ఇండియా హౌస్‌ చిత్రంతో దర్శకుడిగా పాన్‌ ఇండియా లెవెల్‌లో పరిచయం కాబోతున్నారు. ది ఇండియా హౌస్‌ చిత్రాన్ని మెగా పవర్‌ స్టార్‌ సరికొత్తగా ప్రారంభించిన తన చిత్రనిర్మాణ సంస్థ వి మెగా బ్యానర్‌ ద్వారా  సమర్సిస్తుండగా, కాశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2 చిత్రాలతో బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ వరకూ అన్ని భాషలలో పేరుపొందిన అభిషేక్‌ అగర్వాల్‌ తన నిర్మాణ సంస్థ ఎఎఎ పతాకంపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Abhishek agarwal and ram charan making a movie

పాన్‌ ఇండియా స్థాయిలో ది ఇండియా హౌస్‌ చిత్రం కూడా భారీ సంచలనాన్ని సృష్టిస్తుందని బాలీవుడ్‌ మీడియా సైతం చెబుతోంది. అభిషేక్‌ అగర్వాల్‌ ది ఇండియా హౌస్‌ చిత్రం గురించి చెబుతూ, రాబోయే రోజుల్లో ది ఇండియా హౌస్‌ చిత్రం గురించి కాశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రం గురించి ఎలా దేశమంతా చర్చించుకుని, ఆ చిత్ర విజయానికి కారణమయ్యారో అలా మాట్లాడుకుని, చిత్రానికి ఘన విజయాన్ని అందిస్తారని, ఇటువంటి చిత్రాన్ని మెగా పవర్‌ స్టార్‌తో కలసి నిర్మించడం మరో గర్వకారణమని అన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ది ఇండియా హౌస్‌ చిత్రం ఏఫ్రిల్‌ నెలలో విడుదల కాబోతోందని అభిషేక్‌ అగర్వాల్‌ చెప్పారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş