iDreamPost
android-app
ios-app

దేవర సైలెంట్ అయ్యాడా? సైలెంట్ చేశారా? ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Strategic Reasons Behind The Silence Of Jr NTR's Devara Team: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న దేవర సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. కానీ, ఈ మౌనం వరకు చాలా పెద్ద కారణమే ఉంది అంటున్నారు. ఇక రాబోయేది దేవర కాలమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Strategic Reasons Behind The Silence Of Jr NTR's Devara Team: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న దేవర సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. కానీ, ఈ మౌనం వరకు చాలా పెద్ద కారణమే ఉంది అంటున్నారు. ఇక రాబోయేది దేవర కాలమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దేవర సైలెంట్ అయ్యాడా? సైలెంట్ చేశారా? ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన ఈ యంగ్ టైగర్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడ ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. తన నటనతో, తన వ్యక్తిత్వంతో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మరోవైపు బాలీవుడ్ లో వార్ 2లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో అటు హిందీ వాళ్లని కూడా అలరించేందుకు రెడీ అయిపోతున్నాడు. కానీ, ఇటు తెలుగు ప్రేక్షకులు మాత్రం కాస్త నిరాశగా ఉన్నారు. ఎందుకంటే తారక్ చేస్తున్న దేవర నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి.. అదేంటంటే దేవర టీమ్ కావాలనే సైలెంట్ గా ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం తారక్ మాత్రమే కాదు.. దేవర టీమ్ కూడా సైలెంట్ మోడ్ లోనే ఉంది. దేవరకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ దేవర గురించి ఎలాంటి ఊసు లేదు. ఇటీవలే గోవాలో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ, అక్కడ విపరీతమైన వర్షాల కారణంగా షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్ తిరిగి వచ్చేశాడు కూడా. ఇవన్నీ చూసి తారక్ ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారు అని తెలుస్తోంది. కానీ, దేవర మౌనం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది అంటున్నారు. అదేంటంటే.. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఉన్న సినిమా ఆడియన్స్ మొత్తం కల్కి 2898 ఏడీ మూడ్ లో ఉన్నారు. అందుకే కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.

Devara

అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి మూడే నడుస్తోంది. రిలీజ్ కి ముందు నుంచే కల్కి జోరుగా ప్రమోషన్స్ చేసింది. ఎక్కడ చూసినా ఆ మూవీ గురించే చర్చలు. అలాగే థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ మూవీ రికార్డులు, కలెక్షన్స్ అంటూ ఆ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దేవర నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా కూడా ఈ కల్కి హవాలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సినిమా టీమ్ ఆ రిస్క్ తీసుకోలేదు అని చెప్తున్నారు.

కాస్త కల్కి జోరు తగ్గిన తర్వాత దేవర యాక్షన్ లోకి దిగబోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు కల్కి తర్వాత టాలీవుడ్ లో ఆ రేంజ్ మూవీ ఏమీ లేదు. పుష్ప 2 కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ కు వెళ్లిపోయింది. కాబట్టి.. తర్వాతి రోజులు అన్నీ దేవరవే అని చెప్పాలి. ఇప్పటి నుంచి రిలీజ్ వరకు ఎన్ని అప్ డేట్స్ అయినా ఇవ్వచ్చు. మూవీ టీమ్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో రచ్చ చేసేందుకు తారక్ ఫ్యాన్స్ రెడీ అయిపోవారి అంటున్నారు. మరి.. కావాలనే దేవర సైలెంట్ అయ్యాడు అని వస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş