iDreamPost
android-app
ios-app

Rohan Rai: 90స్ ఏ మిడిల్ క్లాస్ లో అదరగొట్టిన రోహన్‌ రాయ్‌ గురించి మీకు తెలియని నిజాలు!

రోహన్‌ రాయ్‌ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అతడి అ‍ల్లరి, అమాయకత్వం అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌మీడియాలో అతడి గురించి సెర్చ్‌ చేస్తూ ఉన్నారు.

రోహన్‌ రాయ్‌ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అతడి అ‍ల్లరి, అమాయకత్వం అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌మీడియాలో అతడి గురించి సెర్చ్‌ చేస్తూ ఉన్నారు.

Rohan Rai: 90స్ ఏ మిడిల్ క్లాస్ లో అదరగొట్టిన రోహన్‌ రాయ్‌ గురించి మీకు తెలియని నిజాలు!

ఇప్పుడు తెలుగునాట ఎక్కడ చూసినా ‘ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌ సిరీస్‌ పేరు తరచుగా వినిపిస్తోంది. జనవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్‌ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. చూసిన వారంతా వెబ్‌ సిరీస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక, ఈ వెబ్‌ సిరీస్‌లో నటించిన వారందరికీ మంచి గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా శివాజీ కుమారుడి పాత్ర చేసిన రోహన్‌ రాయ్‌కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సోషల్‌ మీడియాలో ఇతడి గురించి సెర్చ్‌ చేయటం మొదలుపెట్టారు.

ఇంతకీ ఎవరీ రోహన్‌ రాయ్‌!

రోహన్‌ రాయ్‌ సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కళ్యాణ వైభోగమే సీరియల్‌ కోసం ఆడిషన్స్‌ జరుగుతుంటే.. తల్లితో పాటు ఆడిషన్స్‌ వెళ్లాడు. ఆడిషన్స్‌లో సెలెక్టయ్యాడు. సీరియల్‌లో ‘చారు కేశ’ పాత్ర చేశాడు. ఈ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ  ఇచ్చాడు. రామ్‌ చరణ్‌ ‘వినయ విధేయ రామ’లో నటించాడు. ఓ వైపు సినిమాలు, మరో వైపు సీరియళ్లు చేస్తూ బిజీ అయిపోయాడు. 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో వెబ్‌ సిరీస్‌లలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో ఆధిత్య పాత్ర చేశాడు. పండిత పుత్రహాః పరమ సుంఠహాః అ‍న్న సామెతకు ఆధిత్య ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తాడు. చదువుల్లో చాలా వీక్‌ అయిన ఆధిత్య పాత్రలో రోహన్‌ ఒదిగిపోయి నటించాడు. ఆధిత్య పాత్ర సృష్టించే కామెడీతో మన పొట్టలు చెక్కలవ్వటం ఖాయం. రోహన్‌ తన అమాయకత్వంతో అందర్నీ ఆకట్టుకుంటాడు. చాలా సన్ని వేశాల్లో నవ్విస్తే.. కొన్ని సన్ని వేశాల్లో ఏడ్పిస్తాడు. మొత్తానికి ఆధిత్య అదరహో అనిపిస్తాడు.

ఇంతకీ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కథ ఏంటంటే..

చంద్రశేఖర్‌( శివాజీ) ఓ లెక్కల మాస్టారు. ఇతడిది మధ్య తరగతి కుటుంబం. భార్య రాణి( వాసుకీ ఆనంద్‌ సాయి), ముగ్గురు పిల్లలు రఘు( మౌళి తనూజ్‌ ప్రశాంత్‌), దివ్య ( వాసంతిక), ఆదిత్య( రోహన్‌ రాయ్‌)లతో కలిసి ఓ ఇంట్లో ఉంటాడు. పెద్ద కొడుకు, కూతురు చదువుల్లో చురుగ్గా ఉంటారు. చిన్న కొడుకు ఆధిత్య చదువులో వెనుక బడి ఉంటాడు. రఘు క్లాస్‌మేట్‌ సుచిత్ర(స్నేహాల్‌ కామత్‌)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం పరితపిస్తుంటాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం పదవ తరగతిలో అతడు ఫస్ట్‌ ర్యాంకు సాధిస్తాడని నమ్మకంగా ఉంటారు. రఘు టెన్త్‌లో జిల్లా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడా? రఘు, సుచిత్రల లవ్‌ స్టోరీ ఏమైంది? మధ్యలో ఉప్మా స్టోరీ ఏంటి? అనేదే మిగిలిన కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి