లక్కీ ఛాన్స్.. 10th పాసైతే చాలు.. రైల్వేలో 1,010 ఉద్యోగాలు మీవే

నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో 1010 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. టెన్త్ పాసైతే చాలు ఈ ఉద్యోగాలను పొందొచ్చు. మంచి వేతనం అందిస్తారు వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో 1010 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. టెన్త్ పాసైతే చాలు ఈ ఉద్యోగాలను పొందొచ్చు. మంచి వేతనం అందిస్తారు వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది ఇండియన్ రైల్వే. మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఇదే మంచి అవకాశం. రైల్వేలో ఉద్యోగం పొంది మంచి వేతనం అందుకోవచ్చు. ఇటీవల చెన్నై లెని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024-25కి సంబంధించి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1010 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎలక్ట్రీషియన్,కార్పెంటర్,ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్ఏఏ వంటి ట్రేడుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ట్రేడులను అనుసరించి గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి 50 శాతం మార్కులతో పదో తరగతి సంబంధిత ట్రేడులలో ఐటీఐ, ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూన్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల సంఖ్య:

1010

ట్రేడులు:

ఎలక్ట్రీషియన్,కార్పెంటర్,ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్ఏఏ.

అర్హత:

ట్రేడులను అనుసరించి గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి 50 శాతం మార్కులతో పదో తరగతి సంబంధిత ట్రేడులలో ఐటీఐ, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైఫండ్:

నెలకు రూ. 6 వేల నుంచి 7 వేలు అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

22-05-2024

దరఖాస్తు చివరి తేదీ:

21-06-2024

Show comments