యువకుడిపై దాడి చేస్తూ.. నోట్లో మూత్రం పోసి.. ఎక్కడో తెలుసా?

Sonbhadra Crime News: ఇటీవల భారత దేశంలో ఎన్నో దారుణ ఘటనలు జరుగుతన్నాయి. యువకులను కొట్టడం, హింసించడం, వారిపై మూత్ర విసర్జన చేయడం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కావడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి దారుణ ఘటన మరొకటి వెలుగు చూసింది.

Sonbhadra Crime News: ఇటీవల భారత దేశంలో ఎన్నో దారుణ ఘటనలు జరుగుతన్నాయి. యువకులను కొట్టడం, హింసించడం, వారిపై మూత్ర విసర్జన చేయడం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కావడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి దారుణ ఘటన మరొకటి వెలుగు చూసింది.

భారత దేశం ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది. ఎంత  అభివృ‌ద్ది చెందుతున్నా కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా వెనుకబడే ఉందని అంటున్నారు.   కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కుల వివక్ష,  గిరిజనులు, దళితులపై దాడులు,  మూఢ నమ్మకాలు  ఇంకా ఉన్నాయి. దేశంలో మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కొంతమంది యువకులు ఓ గిరిజన యువకుడిని కట్టేసి బండ బూతులు తిడుతూ, చిత్ర హింసలకు గురి చేస్తూ.. అతడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ గిరిజన యువకుడిపై కొందరు యువకులు చిత్ర హింసలకు గురి చేస్తూ.. బూతులు తిడుతూ నోట్లో మూత్రం పోసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర వివమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సెప్టెంబరు 26న రాత్రి 7 గంటల సమయంలో తన సోదరుడు పవన్ కార్వార్‌ను అంకిత్ భారతితో పాటు మరో ఎనిమిది మంది కలిసి కాలుతో తన్నుతూ దారుణంగా హింసించిన దుండగులు నోట్లో మూత్రం పోశారని శివకుమార్ ఖర్వార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు సోన్‌భద్ర అదనపు ఎస్పీ (హెడ్‌క్వార్టర్స్) కలు సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు అంకిత్ భారతిని అరెస్టు చేశామని, ఇతర నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) కలు సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఇది దిగ్భ్రాంతికరమైన సంఘటన.. సెప్టెంబర్ 26 న జరిగింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.. అందుకే ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారు’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించిన  వీడియో బాధితుడి సోదరుడు ఎక్స్‌లో పోస్ట్ చేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ఇతర పోలీసు అధికారులను ట్యాగ్ చేశాడు. అంకిత్ భారతితోపాటు ఇతర నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి సోదరుడు డిమాండ్ చేశారు.

Show comments