Uppula Naresh
Uppula Naresh
మాములుగా పేద కుటుంబంలో పుట్టిన పిల్లలు బాగుపడేందుకు వారి తల్లిదండ్రులు ఎన్నో రకాలైన సూచనలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా బాగా చదువుకుని భవిష్యత్ లో మంచి హోదాలో స్థిరపడాలని భావిస్తుంటారు. కానీ, కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటల విని బాగా చదువుకుంటున్నారు. మరి కొందరు మాత్రం చదువు ఇష్టం లేక చెడు తిరుగుళ్లు తిరుగుతూ చివరికి దేనికి పనికిరాకుండా మిగిలిపోతూ ఉంటున్నారు. అచ్చం ఇలాగే చదువు అంటే ఇష్టం లేని ఓ ఇంటర్ విద్యార్థి.. తాజాగా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో నానవేని ప్రశాంత్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలోని హాస్టల్ లో ఉంటూ ఇంటర్ చదువుకుంటున్నాడు. మరో విషయం ఏంటంటే? ప్రశాంత్ కు చిన్నప్పటి నుంచి చదువు అంటే అంతగా ఇష్టం లేదు. కాలేజీ పేరుతో బయటకు వెళ్తూ బయట తిరిగి వస్తుండేవాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇక మంగళవారం అతని తండ్రి ప్రశాంత్ ను కాలేజీలో దింపేందుకు కరీంనగర్ బయలు దేరారు.
ప్రయాణంలో భాగంగా తండ్రీకొడుకులు కరీంనగర్ బస్టాండ్ లో దిగారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ తండ్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో తండ్రి అప్రమత్తమై కుమారుడి గంటల తరబడి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు. కానీ, కొడుకు జాడ మాత్రం దొరకలేదు. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులకు చేరవేశాడు. దీంతో అందరూ కలిసి ప్రశాంత్ కోసం వెతుకుతుండగా సాయంత్రం గూడెం సమీపంలో ఉన్న గోదావరి నదిలో శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అయితే ప్రశాంత్ చదువు అంటే ఇష్టం లేని కారణంగానే ఇలా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చదువు ఇష్టం లేక గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఈ యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: దారుణం: పరువు తీస్తుందని భార్యను హత్య చేసిన భర్త!