iDreamPost
android-app
ios-app

దారుణం: పరువు తీస్తుందని భార్యను హత్య చేసిన భర్త!

  • Published Aug 09, 2023 | 3:10 PM Updated Updated Aug 09, 2023 | 3:10 PM
  • Published Aug 09, 2023 | 3:10 PMUpdated Aug 09, 2023 | 3:10 PM
దారుణం: పరువు తీస్తుందని భార్యను హత్య చేసిన భర్త!

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. భార్య పరువు తీస్తుందని భర్త అతి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక కృష్ణరాజపురం మహదేవపుర పరిధిలోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో తారానాథ్-సరిత (35) దంపతులు నివాసం ఉంటున్నారు.

వీరికి గతంలో వివాహం జరిగింది. భర్త స్థానికంగా పానీ పూరి షాపును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తల సంసారం సజావుగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. భార్య సరిత గత కొన్ని రోజుల నుంచి స్థానిక ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇలా ఎన్నో సార్లు చోరీలకు పాల్పడి సరిత భర్త పరువును తీసింది. ఆ మహిళ ఇటీవల కూడా మరోసారి చోరీకి పాల్పడినట్లు సమాచారం. భార్య చేసిన పనికి భర్త బయట తల ఎత్తుకుని తిరగలేకపోయాడు.

దీంతో విసుగు చెందని భర్త తారానాథ్… చోరీలు చేసి నా భార్య పరువు తీస్తుందని హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల తారానాథ్ భార్య గొంతు పిసికి హత్య చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. చోరీలకు పాల్పడుతుందని భార్యను హత్య చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: విషాదం: పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet