దారుణ ఘటన: కోర్టులోనే న్యాయమూర్తిని కాల్చి చంపిన పోలీసు!

USA News: అమెరికాలో తుపాకీ సంస్కృతికి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ గన్ సంస్కృతి కారణంగా జరిగిన ఘటనల్లో అనేక మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సారి ఏకంగా జిల్లా జడ్జీనే హత్యకు గురయ్యారు.

USA News: అమెరికాలో తుపాకీ సంస్కృతికి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ గన్ సంస్కృతి కారణంగా జరిగిన ఘటనల్లో అనేక మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సారి ఏకంగా జిల్లా జడ్జీనే హత్యకు గురయ్యారు.

నేటి సమాజంలో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హత్యఘటనలు ఎక్కువయ్యాయి. ఇంకా దారుణం ఏమిటంటే..న్యాయం చెప్పే జడ్జీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో హత్యలకు కూడా పాల్పడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఓ న్యాయముర్తిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అలానే ఇద్దరు దంపతులైన లాయర్లను కూడా నడ్డిరోడ్డుపై కత్తులతో దాడి చేసి.అత్యంత దారుణంగా చంపారు. ఇది ఇలాంటే తాజాగా ఏకంగా కోర్టులోనే ఓ జడ్జీ హత్యకు గురయ్యాడు. ఓ పోలీసు కోర్టులోనే జడ్జీని కాల్చి చంపాడు. దీంతో కోర్టులోని వారందరూ ఒక్కసారిగా షాకి గురయ్యారు. మరి..ఈ ఘటనపై అమెరికాలో చోటుచేసుకుంది.

అమెరికాలో తుపాకీ సంస్కృతికి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇంట్లో వస్తువులు దొరికినంత ఈజీగా ఆయుధాలు అక్కడ లభిస్తుంటాయి. ఇప్పటికే గన్ సంస్కృతి కారణంగా జరిగిన ఘటనల్లో అనేక మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా కాల్పులు జరిగాయి. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ గన్ కల్చర్ కి ఈ సారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తిపై ఓ పోలీసు అధికారి బులెట్ల వర్షం కురిపించాడు.

గురువారం అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్‌ కౌంటీలోని వైట్స్‌బర్గ్‌ జిల్లా కోర్టులో ఈ దారుణ ఘటన జరిగింది. వైట్స్ బర్గ్ జిల్లా కోర్టులో 54 ఏళ్ల కెవిన్‌ ములిన్స్‌ జడ్జీగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఆయన ఛాంబర్‌ లోనే లెట్చర్‌ కౌంటోలో పోలీసు అధికారి అయినా షాన్‌ ఎం స్టైన్స్‌.. జడ్జీని కాల్చిచంపారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. అంతేకాక పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. ఇక ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. అసలు కోర్టులే ఏం జరిగింది అంటే.. గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో పోలీసులు అధికారిగా షాన్ పని చేస్తున్నాడు.

అతడు గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌ బర్గ్‌ కోర్టుకి వచ్చాడు. అక్కడ ఆ కోర్టు జిల్లా జడ్జి అయినా ములిన్స్‌ తో ప్రత్యేకంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి.. షాన్ ను తన ఛాంబర్‌ కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. కాసేపు మాట్లాడుకున్న తరువాత..లోపలి నుంచి పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి. అలా చాలా సేపు వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగిందని బయట కూర్చున్న వ్యక్తులు తెలిపారు. కాసేపటి తరువాత లోపలి నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. ఆ తరువాత తలుపు తీసుకుని షాన్ బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు..ఛాంబర్‌ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తపు మడుగులో జడ్జీ పడి ఉన్నాడు.

ఈ హత్యకు సంబంధించిన పలు విషయాలను కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్‌ గేహార్ట్‌ శుక్రవారం వెల్లడించారు.  అయితే జడ్జిని షరీఫ్‌ షాన్  చంపడానికి గల కారణాలు మాత్రంఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ ల మధ్య తీవ్ర గొడవ జరిగిందనేది తెలియలేదు. షరీఫ్‌ ను అరెస్ట్‌ చేసి పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి. దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడిని విచారించిన తరువాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మొత్తంగా కోర్టులోనే జడ్జీని కాల్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరి.. ఇలాంటి దారుణ ఘటనల నిర్మూలనకు ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments