P Krishna
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకువచ్చే టీచర్లు ఇటీవల గాడి తప్పుతున్నారు. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తీసుకు వస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకువచ్చే టీచర్లు ఇటీవల గాడి తప్పుతున్నారు. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తీసుకు వస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
P Krishna
పూర్వ కాలం నుంచి సమాజంలో గురువుకు గొప్ప స్థానం కల్పించబడింది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారిని సమాజంలో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది గొప్ప పొజీషన్ కి తీసుకువచ్చేలా గురువులు బాధ్యత వహిస్తారు. అందుకే గురు బ్రహ్మః, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరభ్రమ్మ, తస్మైశ్రీ గురవే నమః అంటూ గురువులను దేవుడిలా పూజిస్తుంటారు. కానీ ఈ మద్య కొంతమంది గురువు స్థానానికి కలంకం తీసుకువస్తున్నారు. విద్యార్థులతో ఎఫైర్లు పెట్టుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం సేవించి క్లాస్ రూమ్ లోకి రావడం, విద్యార్థులను అన్యాయంగా కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తున్నారు. ఓ టీచర్ 16 ఏళ్ల విద్యార్థితో ఎఫైర్ పెట్టుకుంది.. తోటి విద్యార్థులు గుట్టు రట్టు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కొంతమంది మహిళా టీచర్లు విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్ కు పునాధులు వేయాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి క్షణిక సుఖం కోసం వారి జీవితాలతో ఆడుకుంటున్నవారిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించిన విద్యార్థి తండ్రి పై కూడా పోలీసులు అభియోగం మోపారు. పులాస్కి కౌంటీలోని లాక్వీ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్న హేలి నిచెల్ క్లిఫర్టన్ కర్మాన్ (26) పై అత్యాచారం, విద్యార్థితో లైంగిక సంబంధాలు, పిల్లల వేధింపుల నేరారోపణలపై టెక్సాస్‌లోని గార్డెన్ రిడ్జ్ లో పారిపోతుండగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
హేలి నిచెల్ తో తన సహ విద్యార్థికి అక్రమ సంబంధం గురించి స్కూల్ రీసెర్స్ ఆఫీసర్ కి తెలియజేశాడు. అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 16 ఏళ్ళ విద్యార్థి టీచర్ హెలీతో శృంగారం చేశారని ప్రత్యక్ష సాక్షి తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీచర్ హెలీ ఇటీవల తన భర్తకు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. విద్యార్థితో ఎఫైర్ పెట్టుకున్న హెలీ అతనికి 100 శాతం మార్కులు ఇచ్చేదని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు వీరిద్దరికి సంబంధించిన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలించారు. వారి మధ్య సంభాషనలు, చాటింగ్ చూసి కన్ఫామ్ చేసుకున్నారు. తన గుట్టు బయట పడటంతో హేలి నిచెల్ పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.