మంచిదొంగ.. దోచిన సొమ్మును నెల రోజుల్లో ఇస్తానని లేఖ రాసి

ఎవరూ పుట్టుకుతోనే దొంగగా మారారు. పరిస్థితులు, ఆర్థిక అవసరాలు కొంత మందిని దొంగగా మారుస్తుంటాయి. కానీ ఈ రోజుల్లో జల్సాలకు అలవాటు పడి కొందరు దొంగలుగా మారుతున్నారు. ఇళ్లకు కన్నాలు వేసి దొరికినదంతా దోచుకెళుతున్నారు. దీంతో కష్టపడిన సొమ్ము అంతా దొంగలపాలు కావడంతో బాధితులు కన్నీరుమున్నీరు అవుతుంటారు. కానీ

ఎవరూ పుట్టుకుతోనే దొంగగా మారారు. పరిస్థితులు, ఆర్థిక అవసరాలు కొంత మందిని దొంగగా మారుస్తుంటాయి. కానీ ఈ రోజుల్లో జల్సాలకు అలవాటు పడి కొందరు దొంగలుగా మారుతున్నారు. ఇళ్లకు కన్నాలు వేసి దొరికినదంతా దోచుకెళుతున్నారు. దీంతో కష్టపడిన సొమ్ము అంతా దొంగలపాలు కావడంతో బాధితులు కన్నీరుమున్నీరు అవుతుంటారు. కానీ

చతుషష్టి కళల్లో (అరవై నాలుగు)చోర కళ కూడా ఒకటి. మూడో కంటికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు, విలువైన వస్తువులు దొంగిలిస్తుంటారు దొంగలు. ఒకప్పుడు అర్థరాత్రి వేళల్లో, అందరూ నిద్ర పోతున్న వేళ ఇంట్లోకి చొరబడి దోచుకెళ్లేవారు. కానీ ఈ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడే దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక ఇంటిపై కన్నేశాడంటే దొంగతనానికి పాల్పడినదే నిద్రపోడు దొంగ. సాధారణంగా ఓ ఇంట్లో దొంగతనానికి జరిగి.. వస్తువులు దోచుకెళితే.. తిరిగి దొరుకుతాయన్న హోప్ ఉండదు. పోలీసులకు చెప్పినా..  దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం అని చెబుతారు. కానీ కొన్ని సంవత్సరాలు, యుగాలు గడిచినా దొంగతనానికి గురైన వస్తువులు దొరకడం కల్లే. కానీ దొంగల్లో కూడా మానవత్వం ఉందని, మంచి మనస్సు ఉందని నిరూపించాడో చోరుడు.

తమిళనాడులో కూడా ఇంట్లో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు.  తప్పని సరి పరిస్థితుల్లో ఈ చోరీ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. దోచుకెళ్లిన సొమ్మును తిరిగి నెల రోజుల్లో ఇస్తానంటూ లేఖ రాసి వెళ్లాడు. ఈ వింత ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూత్తుక్కుడి జిల్లాలోని తిరుచ్చెందూర్‌ వద్ద మేఘ్నాపురానికి చెందిన చిత్తిరై సెల్విన్‌ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉండగా.. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. వారు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. జూన్ 17న భార్యతో కలిసి చెన్నై వెళ్లాడు సెల్విన్. వీరి ఇంటిని చూసుకునేందుకు ఓ మహిళను నియమించుకున్నారు.

జులై 1న ఇళ్లు శుభ్రం చేసేందుకు వచ్చిన ఆ మహిళ ఇంటిని చూసి షాక్ అయ్యింది. తాళం పగులకొట్టి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందింది. దీంతో హుటాహుటిన ఇంటికి వచ్చాడు సెల్విన్. బీరువాలో వెళ్లి చూడగా.. రూ.60వేల నగదు. ఒకటిన్నర సవర్ల బంగారు కమ్మలు, వెండి గొలుసులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులకు దొంగ రాసిన ఉత్తరం కనిపించింది. అందులో.. ‘నన్ను క్షమించండి. నేను నెలలో తిరిగిస్తాను. ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, అందుకే దొంగతనం చేశా’నని రాసి ఉంది. ఈ లేఖను చూసిన పోలీసులు, ఇంటి యజమాని విస్తుపోయారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మరీ ఈ మంచిదొంగ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడో లేదో.. కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Show comments