వీడియో: రోడ్డు ప్రమాదంలో తుక్కు తుక్కైన రూ.10 కోట్ల కారు!

వీడియో: రోడ్డు ప్రమాదంలో తుక్కు తుక్కైన రూ.10 కోట్ల కారు!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. మనం ఎంత ఖరీదైన కార్లలో ప్రయాణించిన.. వేగం శృతి మించితే.. ప్రమాదం తప్పదు. అందుకు ఉదాహరణగా అనేక ఘటనలు జరిగాయి. ఎందరో ధనవంతుల పిల్లలు ఖరీదైన కార్లలో అతివేగంగా ప్రయాణించి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రోల్స్ రాయిస కంపెనీ చెందిన కారు కూడా ప్రమాదానికి గురైంది.  దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఈ కారు ప్రమాదంలో తుక్కు తుక్కుగా మారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మంగళవారం హర్యాన రాష్ట్రంలోని నూహ్ ప్రాంతంలో న్యూఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై లగ్జరీ కారు రోల్స్ రాయిస్ కారు.. ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ట్యాంకర్ లో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.  ఈ రోల్స్ రాయిస్ కారు ప్రయాణిస్తున్న వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, కుబేర్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ మాలుగా పోలీసులు గుర్తించారు.

ఆయన, మరో ఇద్దరితో కలిసి  ఈ కారులో ప్రయాణిస్తున్నారు. వికాస్ మాలు కు తీవ్ర గాయాల కావడంతో గురు గ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.  ఆయన తో పాటు ఉన్న మరో ఇద్దరికి కూడా చికిత్స అందుతోంది. వికాస్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పష్ట ఇవాల్సి ఉంది. నూహ్ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ యు టర్న్ తీసుకుంటుండగా రోల్స్ రాయిస్ వేగంగా వచ్చి.. ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిందని అందులోనే  ఉన్న గౌతమ్ అనే వ్యక్తి పోలీసులకు తెలిపాడు. పెట్రోల్ ట్యాంకర్ లోని ఇద్దరు మరణించగా..గౌతమ్ ప్రాణాలతో బయట పడ్డాడు.

ప్రస్తుతం అతను హర్యానాలోని ఉజినాలో తీవ్ర గాయాలకు చికిత్స పొందుతున్నాడు. రోల్స్ రాయిస్ గంటకు 190 కి వేగంతో ట్యాంకర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తుక్కు తుక్కు అయినా రోల్స్ రాయిస్ కారు ధర రూ.10 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుందని తెలుస్తోంది. ప్రమాదం జరిగినపుడు కారు ముందుభాగం ధ్వంసమై ఇంజన్ కాలిపోయి తలుపులు తెరిచి ఉన్నాయి. ట్యాంకర్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. దీనిని బట్టి ప్రమాదం ఏ స్ధాయిలో జరిగిందో ఊహించవచ్చును. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని జరుపుతున్నారు.

ఇదీ చదవండి: రైల్లో పేలిన గ్యాస్ సిలిండర్! కళ్ల ముందే దారుణం!

 

Show comments