Uppula Naresh
Uppula Naresh
జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాప్ట్ వేర్ ఉద్యోగి దీప్తి మృతి కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాదాపు రెండు మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలను ఈ కేసు ఓ ఊపు ఊపేసింది. అక్క దీప్తి చనిపోవడం, చెల్లెలు చందన అదృశ్యమవ్వడం అంతా చకచక జరిగిపోయింది. ఈ క్రమంలోనే దీప్తి మరణవార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు దీప్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే దీప్తిని ఆమె చెల్లెలు అయిన చందనే హత్య చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందేమోనన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు పరారీలో ఉన్న చందనను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి ఆమె కోసం గాలించారు. చందన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఒంగోలులో ఉన్నట్లు పోలీసులు శనివారం గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని చందనతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ ఈ ఘటనకు సంబంధించిన అసలు నిజాలను వెల్లడించారు. అయితే ఈ కేసులో ఆ తప్పు చేయకపోయి ఉంటే దీప్తి బతికి ఉండేదేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
దీప్తి ఆ తప్పు చేయకపోతే బతికే ఉండేదేమో?
ఆగస్టు 28వ రోజు దీప్తి తల్లిదండ్రులు హైదరాబాద్ లో బంధువుల గృహ ప్రవేశం ఉండడంతో అక్కడికి వెళ్లారు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న చందన.. అదే రోజు రాత్రి ప్రియుడితో పాటు వెళ్లిపోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇంట్లోని నగదు, బంగారు అభరణాలు కూడా వెంట తీసుకెళ్లాలనుకుంది. ఈ క్రమంలోనే చందన ఓ ప్లాన్ గీసింది. ఆ రోజు రాత్రి 10 వరకు ఇంట్లో ఉన్న అక్కా దీప్తి, చెల్లెలు చందన తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఇక తన ప్లాన్ పథకం ప్రకారమే.. చందన తన ప్రియుడైన ఉమర్ షేక్ సుల్తాన్ ను ఇంటికి రమ్మని చెప్పి దారిలో ఓ ఓడ్కా, బ్రీజర్ బాటిళ్లు తీసుకురమ్మని కబురు పంపింది. ఇక ఉమర్ ప్రియురాలు కోరినట్లుగానే మద్యం బాటిళ్లు తీసుకొచ్చి చందనకు ఇచ్చాడు. ఆ తర్వాత ఓడ్కా బాటిల్ ను అక్క దీప్తికి ఇచ్చి చందన మాత్రం చందన తాగింది. ఇక దీప్తి ఓడ్కాను సగానికిపైగా తాగి సృహ కోల్పోయి పడిపోయింది.
ఇదే మంచి టైమ్ అనుకున్న చందన.. ప్రియుడు ఉమర్ ను ఇంట్లోకి పిలిచి బీరువాలో ఉన్న నగదు, బంగారు అభరణాలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే దీప్తికి హఠాత్తుగా మెలుకువ వచ్చి చూడగా.. చెల్లి చందన ఆమె ప్రియుడు కలిసి బీరువా వద్ద నగలు దోచుకుంటున్నారు. ఇది చూసి ఆ యువతి షాక్ గురైంది. వెంటనే దీప్తి పెద్దగా కేకలు వేసింది. ఇక భయపడి పోయిన చందన, ఆమె ప్రియుడు ఉమర్, ఇతని స్నేహితుడు ముగ్గురు కలిసి దీప్తి గొంతుకు కవర్ చుట్టి ఊపిరాడకుండా చేశారు. దీంతో దీప్తి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత చందన ఇంట్లోని నగదు, అభరణాలు తీసుకుని ప్రియుడితో పాటు కారులో పారిపోయింది. ఇక సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి ఒంగోలులో ఉన్న చందన, ఆమె ప్రియుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. అ తర్వాత మీడియా ద్వారా ఎస్పీ దీప్తి మృతి కేసుకు సంబంధించిన అసలు నిజాలు వెల్లడించారు. దీప్తి హత్యకు చందన ఎలా ప్లాన్ వేసిది? ఆ తర్వాత ఎలా హత్య చేశారనే పూర్తి వివరాలు ఎస్పీ వెల్లడించారు. చివరిగా మరో విషయం ఏంటంటే? చెల్లెలు చందన ఇంట్లో నగలు తీసుకుంటున్న క్రమంలో దీప్తి నిద్రలేవకుండా ఉండి ఉంటే దీప్తి బతికి ఉండేదేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు.