iDreamPost
android-app
ios-app

చందనాది ఇంత క్రిమినల్ మైండా? వెలుగులోకి షాకింగ్ నిజాలు!

చందనాది ఇంత క్రిమినల్ మైండా? వెలుగులోకి షాకింగ్ నిజాలు!

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టెక్కీ దీప్తి మృతికేసులో వెలుగు చూస్తున్న విషయాలు చూసి అంతా నిర్ఘాంత పోతున్నారు. దీప్తి మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ హత్యకేసులో ప్రధాన నిందితురాలు తన చెల్లి చందనానే అనే నిర్ధారణకు వస్తున్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అక్క దీప్తీని తన ప్రియుడితో కలిసి చందనానే హత్య చేసినట్లు తెలుసుకుని స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆమె అలా ఎలా చేయగలిగింది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే నిజానికి చందన మైండ్ సెట్ చూస్తే ఇంత క్రిమినల్ మైండా అని భయపడక మానరు.

దీప్తి మృతి కేసులో విషయాలు చిన్నగా వెలుగులోకి వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెల్లెలు, ఆమె ప్రియుడి పాత్రపై అనుమానం వచ్చింది. దీప్తి చేయి విరిగి ఉండటంతో ఇది కచ్చితంగా ఆత్మహత్య అయి ఉండదనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కనిపించకుండా పోయిన చెల్లి చందనా అక్క మృతికి తనకి సంబంధం లేదంటూ ఒక వాయిస్ నోట్ కూడా పంపింది. చాలామంది నిజంగానే చెల్లికి సంబంధం ఉండి ఉండదేమో అనుకున్నారు. కానీ, అందరి ఆలోచనలు రివర్స్ అయ్యాయి. చంపింది చెల్లే అని తెలుసుకుని నిర్ఘాంత పోతున్నారు. మరోవైపు చందన మైండ్ సెట్ చూస్తే.. ఆమె ఇంత క్రిమినలా అనే అనుమానం రాకమానదు.

చందన మొదట తాము చేసుకున్న మద్యం పార్టీ గురించి చెప్పలేదు. తర్వాత తాము మద్యం పార్టీ చేసుకుని వెళ్లిపోయాయమని చెప్పింది. కానీ, ఆమె అసలు తన అక్క అడ్డు తొలిగించుకోవాలని ఇలా చేసిందని చెబుతున్నారు. అంతేకాకుండా అక్క దగ్గర డబ్బు, నగలు ఉన్నాయని తెలుసుకుని వాటితో ఉడాయించాలనే అక్కను అంతమొందించింది అంటున్నారు. దీప్తి వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, దాదాపు రూ.90 లక్షలు విలువజేసే బంగారు ఆభరణాల కోసమే అక్కను హత్య చేసిందని చెబుతున్నారు. ఆమె చేయి కూడా విరిగి ఉండటంతో.. ఆమెను హింసించి చంపిం ఉంటారేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నిజానికి డబ్బు కోసం ఒక అమ్మాయి ఇలా చేసిందంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. ప్రియుడితో కలిసి వెళ్లిపోవడానికే ఆమె ప్రయత్నించింది అనుకున్నారు. కానీ, ఆమె అసలు స్కెచ్ డబ్బు, నగలు అని తెలిసి చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. అయితే ఆమె అలవాట్లు, డబ్బు కోసం అక్కనే చంపిన వైనం చూస్తే చందనా చాలా పెద్ద క్రిమినల్ మైండ్ కలది అనే కంక్లూజన్ కి వచ్చేస్తున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet